మొనగాళ్లంతా నా వద్దకే వస్తున్నారు: అవేంజర్స్
Spread the love

హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుండి వస్తున్న మరో భారీ చిత్రం ‘అవేంజర్స్ ఇది ఇన్ఫినిటీ వార్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 27న గ్రాండ్‌గా విడుదలవ్వబోతోంది. ఇండియాలో ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్లో మెయిన్ విలన్ థైనోస్ పాత్రకు రానా దగ్గుబాటి డబ్బింగ్ చెబుతున్నారు. భారతీయ స్థానిక చిత్రాలకు ధీటుగా ఈ చిత్రానికి టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మార్వాల్ స్టూడియో సంస్థ నుంచి గతంలో ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా, స్పైడర్ మాన్ వంటి సూపర్ హీరో చిత్రాలు వచ్చాయి. వీరంతా ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్న చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. సినీ విశ్లేషకుల చెబుతున్నా మాట ప్రకారం అవెంజర్స్ చిత్రం కమర్షియల్ చిత్రాలకు బాబులాంటి సినిమా అని అంటున్నారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ప్రపంచ వ్యాప్తంగా 1600 వందల కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

తెలుగులో భారీ రిలీజ్

తెలుగులో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. సమ్మర్ సెలవులు కావడంతో ఈ చిత్రానికి ఇక్కడ భారీ ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయసుల ప్రేక్షకులు ఇష్టపడే సూపర్ హీరో క్యారెక్టర్లతో ఈ చిత్రం రూపొందడం జరిగింది, ఆన్ లైన్ లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దక్కుతున్న ఆదరణ చూసి ప్రముఖ సంస్థ బుక్ మై షో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

కథ

మార్వల్ సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని అతిపెద్ద విలన్ తానొస్ నుంచి రక్షించడమే ఈ చిత్ర కథ. అద్భుత విన్యాసాలు, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో అవెంజర్స్ చిత్రం భారతీయ సినీ ప్రియులని అలరించడానికి సిద్ధంగా ఉంది. అవెంజర్స్ చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే యాక్షన్ ప్రియులకు విందుభోజనం అని చెప్పొచ్చు.

ఇండియాలో వసూళ్ల పరంగా మొదటి స్థానాల్లో నిలిచిన చిత్రాలు ఇవే.

లైఫ్ ఆఫ్ పై – 88

కోట్లు టైటానిక్ – 84

 కోట్లు ది అవెంజర్స్ – 76 కోట్లు

ది అవెంజర్స్ – 76 కోట్లు