‘అరవింద సమేత’ సినిమా రివ్యూ
Spread the love

న‌టీన‌టులు: ఎన్టీఆర్‌, పూజాహెగ్డే, జ‌గ‌ప‌తిబాబు, సునీల్‌, నాగ‌బాబు, ఈషారెబ్బ‌, సుప్రియ పాత‌క్‌, న‌వీన్ చంద్ర‌, దేవ‌యాని, సితార‌, బ్ర‌హ్మాజీ, రావు ర‌మేష్ త‌దిత‌రులు

సంగీతం: త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: పీఎస్ వినోద్‌

ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి

స్టంట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పీడీవీ ప్ర‌సాద్‌

నిర్మాత‌: ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు)

ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్

బ్యాన‌ర్‌: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌

మాట‌ల‌నే ఆయుధాల‌ను త‌యారు చేయ‌డానికి ఒక కర్మాగారం అంటూ ఏదైనా ఉందంటే అది త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌. మ‌రి అంత‌టి ప‌దునైన క‌త్తుల్లాంటి డైలాగ్‌లను దుయ్యగ‌లిగేవాడు. బ‌ల్లెంలా విస‌ర‌గ‌లిగేవాడు. బాణాల్లా సంధించ‌గ‌లిగే వాడు ‘యంగ్ టైగ‌ర్‌’ ఎన్టీఆర్‌. మ‌రి వీరిద్ద‌రూ క‌లిస్తే, రంరుధిరం స‌మ‌రం శిశిరం అంటూ వెండితెర‌పై క‌నిపించే ఆ మేజిక్కే వేరు. అందుకే ఈ కాంబినేష‌న్‌కు ఎంతో క్రేజ్‌ ఉన్నాది. ఆయన శైలికి భిన్నంగా ఔట్ అండ్ ఔట్ మాస్ ఎలిమెంట్స్‌తో రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘అరవింద సమేత’ చిత్రాన్ని రూపొందించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ ;

వీర‌రాఘ‌వ (ఎన్టీఆర్‌) ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల్లో తండ్రి(నాగ‌బాబు)ని కోల్పోతాడు. నాయ‌న‌మ్మ‌(సుప్రియ పాత‌క్‌) మాట‌లకు ప్ర‌భావిత‌మై హింస‌కు, ర‌క్తపాతానికి దూరంగా ఉండాల‌ని హైద‌రాబాద్ వెళ్లిపోతాడు. అక్క‌డ అర‌వింద (పూజాహెగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. అర‌వింద కూడా త‌న నాయ‌న‌మ్మ చెప్పిన‌ట్లు ‘హింస వ‌ద్దు.. ర‌క్త‌పాతం వ‌ద్దు’ అని చెబుతుంటుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ.

Aravinda Sametha Review in Telugu

విశ్లేషణ :

వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్ట‌గ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ అన్న పాయింట్‌తో త్రివిక్ర‌మ్ శైలిలో రాసుకున్న క‌థ ఇది. గ‌తంలో ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. వాట‌న్నింటికీ భిన్నంగా త్రివిక్ర‌మ్ ఎలా తీస్తాడా? అని అభిమానులు ఎదురుచూసారు. అందుకు త‌గిన‌ట్లుగానే త్రివిక్ర‌మ్ కొత్త అంశాన్ని ఎంచుకున్నారు. ‘అద‌ర్‌సైడ్ ఆఫ్ ఫ్యాక్ష‌నిజం’ అన్న‌ట్లు వేరే కోణం చూపించారు. ఎన్టీఆర్‌ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించే ప్రయత్నం చేశాడు. అయితే రొటీన్‌ కథ కావటంతో కొంత నిరాశ కలిగిస్తుంది. త్రివిక్రమ్‌ గత చిత్రాలతో పోలిస్తే ఎంటర్‌టైన్మెంట్‌ కూడా తక్కువే. తొలి ఇరవై నిమిషాల్లో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లినా తరువాత ఆ వేగం కనిపించలేదు. ముఖ్యంగా లవ్‌ స్టోరి సాగదీసినట్టుగా అనిపిస్తుంది.

ఒక ర‌కంగా ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం. త్రివిక్ర‌మ్ ప్ర‌ధాన బ‌లం వినోదం. ఆయ‌న గ‌త చిత్రం ఏది తీసుకున్నా వినోదానికి పుష్క‌ల‌మైన స్థానం ఉంటుంది. కాబట్టి, ఈ సినిమాలో ఏదైనా కొర‌వడిందంటే అది వినోద‌మే. త్రివిక్ర‌మ్ శైలి, ప్రాస‌లు, పంచ్‌ల‌కు ఎక్క‌డా చోటు లేదు. హీరోయిజం ఎలివేష‌న్, మాస్ డైలాగ్‌లు వీటిని దృష్టిలోకి పెట్టుకుని థియేట‌ర్‌కు వెళ్తే కాస్త ఇబ్బంది ప‌డ‌తారు. త్రివిక్ర‌మ్ చాలా రోజుల త‌ర్వాత రాసుకున్న క‌థ ఏం చెబుతుంది.. ఏం చెప్పాల‌నుకుంటోంది.. దాన్నే వెండితెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేసాడు. ఎన్టీఆర్ బ‌లాల‌ను చూపిస్తూనే డైలాగుల్లో త‌న‌దైన మార్కు సృష్టించే ప్ర‌య‌త్నం చేశాడు. కొన్ని స‌న్నివేశాల‌కు క్లాప్స్ ప‌డ‌తాయి. కొన్ని సుదీర్ఘంగా సాగుతాయి. మొత్తంగా ‘అజ్ఞాత‌వాసి’ ఫ్లాప్ త‌ర్వాత ప‌క‌డ్బంధీగా రాసుకున్న స్క్రిప్ట్ ఇది.

Aravinda Sametha Review in Telugu

నటీనటులు ;

ఈ సినిమా కూడా అందుకు మినహాయింపేమి కాదు. చాలా మంది నటీనటులు ఉన్నా.. ఎన్టీఆర్‌ అంతా తానే అయ్యి సినిమాను నడిపించాడు. ఎమోషన్స్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ఇలా ప్రతీ భావాన్ని అద్భుతంగా పలికించాడు. అంతేకాదు రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెప్పేందుకు ఎన్టీఆర్‌ చూపించిన డెడికేషన్‌ స్క్రీన్‌ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది. ‘ఆది’, ‘సింహాద్రి’, ‘సాంబ’ చిత్రాల్లో ఉన్న‌ట్లు అగ్రెసివ్‌గా ఎన్టీఆర్ క‌నిపించ‌క‌పోవ‌చ్చు. ఆ పాత్ర‌కు మ‌రో కోణం ఉంటే ఎలా ఉంటుందో వీర‌రాఘ‌వ పాత్ర అలా ఉంటుంది. పూజా హెగ్డే పాత్ర కూడా క‌థ‌లో కీల‌క‌మే. ఒక ర‌కంగా క‌థానాయ‌కుడి పాత్ర‌లో మార్పు రావ‌డానికి బ‌లంగా దోహ‌దం చేసింది

ప్లస్‌ పాయింట్స్‌ ;

ఎన్టీఆర్‌ న‌ట‌న‌

త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు

డైలాగ్స్‌

యాక్షన్‌ సీన్స్‌

నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ ;

త్రివిక్ర‌మ్ మార్కు వినోదం లేక‌పోవ‌డం

కొన్ని బోరింగ్‌ సీన్స్‌

రొటీన్‌ స్టోరి

రేటింగ్: 3.0