అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని రివ్యూ
Spread the love

తారాగ‌ణం: ర‌వితేజ‌, ఇలియానా, సునీల్‌, ల‌య‌, అభిరామి, వెన్నెల‌కిషోర్‌, ర‌విప్ర‌కాష్‌, త‌రుణ్ అరోరా, ఆదిత్య మీన‌న్‌, అభిమ‌న్యు సింగ్‌, విక్ర‌మ్ జిత్‌, షాయాజీ షిండే, రాజ్ వీర్ సింగ్‌, శుభలేఖ సుధాక‌ర్ త‌దిత‌రులు

సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

ఛాయాగ్రహ‌ణం: వెంట‌క్ సి.దిలీప్

క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌

కూర్పు: ఎం.ఆర్‌.వ‌ర్మ‌

నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్‌(సి.వి.ఎం)

ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీనువైట్ల‌

దర్శకుడిగా శ్రీను వైట్లకు లైఫ్ అండ్ డెత్ లాంటి మూవీ.. హీరోగా రవితేజ నిలదొక్కుకోవాలంటే హిట్ తప్పనిసరి.. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానాకు స్టార్ డమ్ దక్కాలంటే ఈ సినిమాతో రాణించక తప్పదు. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా చేయ‌డం విశేషం. దాదాపు ఆరేళ్ల గ్యాప్ త‌ర్వాత ఈమె తెలుగులో చేసిన సినిమా. అలాగే మొదటి సారి తెలుగులో ఇలియానా డ‌బ్బింగ్ చెప్పుకున్న సినిమా కూడా ఇదే. మ‌రి అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని ఎలాంటి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నాడ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

కధ :

అమర్ చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని ఒక హత్య కేసులో అరెస్ట్ అయ్యి పద్నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. అయితే బయటకు వచ్చిన అమర్ వరుసగా ఫెడో ఫార్మా కంపెనీ డైరెక్టర్ లని చంపుతూ ఉంటాడు. ఈ కేసులని సాల్వ్ చేయడానికి ఎఫ్బీఐ ఆఫీసర్ బల్వర్దన్ రంగంలోకి దిగుతాడు. రాగానే రాజ్‌వీర్‌ను ప్లాన్ చేసి చంపేస్తాడు. దాంతో మిగిలిన ముగ్గురు ఓ పోలీస్ ఆఫీస‌ర్ (అభిమ‌న్యు సింగ్‌) స‌హాయం తీసుకుంటారు. ఆ పోలీస్ ఆఫీస‌ర్ హంతకుడిని వెతికే ప‌నిలో ఉంటాడు. ఆ స‌మ‌యంలోనే అమెరికాలోని వాటా అనే తెలుగు అసోసియేష‌న్ అధ్య‌క్షుడు పుల్లారెడ్డి(జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి) తెలుగు వారిని ప్ర‌తి ఏటా పిలిచి ఘ‌నంగా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తుంటాడు. అత‌ని ద‌గ్గ‌రుండే వారిలో గండికోట‌(ర‌ఘుబాబు), మిర్యాల చంటి(వెన్నెల‌కిషోర్‌), కందుల‌(శ్రీనివాస్ రెడ్డి), చేత‌న్ శ‌ర్మ‌(గిరిధ‌ర్‌) ఆ ఈవెంట్ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తుంటారు. వీరిలో చేత‌న్ శ‌ర్మ చాలా మంచివాడు.

విశ్లేష‌ణ‌:

ఈ చిత్రంలో మాస్ మహరాజా రవితేజ.. అమర్, అక్బర్, ఆంటోనీ అనే మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుతో ఒక్కోపాత్ర ఒక్కోలా డిజైన్ చేశారు శ్రీను వైట్ల. ఈ సినిమా ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. గతంలో ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో రవితేజతో జోడీ కట్టిన ఈ బ్యూటీ రీ ఎంట్రీలో రవితేజతో జోడీ కట్టడం మరో విశేషం.

సన్నటి నడుముతో ఆమె అందాన్ని చూసిన సగటు తెలుగు ప్రేక్షకుడు ఆమెయిన్ ఇలా చూసి తట్టుకోవడం కష్టమే అయితే బొద్దుగా ఉన్నప్పటికీ ఇలియానా తన యాక్టింగ్‌తో మెప్పించింది. కమెడియన్లు చాలా మంది ఉన్నా పెద్దగా వాడుకోలేదు. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు బాగానే చేశారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం చాలా రిచ్ గా చూపించారు. థమన్ సంగీతం సోసోగా ఉండి పాటలు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయినా రీ-రికార్డింగ్ బాగుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ మొత్తానికి సక్సెస్ కోసం శ్రీనువైట్ల, రవితేజ మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌

సినిమాటోగ్ర‌ఫీ

నిర్మాణ విలువలు

మైన‌స్ పాయింట్స్‌

క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం

రెగ్యుల‌ర్ ర‌వితేజ‌, శ్రీనువైట్ల సినిమాలా లేదు

రేటింగ్‌: 2.25/5