‘అదుగో’ సినిమా రివ్యూ
Spread the love

నిర్మాణ సంస్థ‌లు: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్‌

తారాగ‌ణం: ర‌విబాబు, అభిషేక్ వ‌ర్మ‌, న‌భా, ఉద‌య్ భాస్క‌ర్, ఆర్‌.కె, వీరేంద‌ర్ చౌద‌రి త‌దిత‌రులు

సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్‌.విహార్‌

ఛాయాగ్ర‌హ‌ణం: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి

క‌థ‌: నారాయ‌ణ రెడ్డి

కూర్పు: బ‌ల్ల స‌త్యనారాయ‌ణ‌

మాట‌లు: ర‌విబాబు, నివాస్‌

ద‌ర్శక‌త్వం: ర‌విబాబు

‘పంది’తో సినిమా. విలక్షణ దర్శకుడు రవిబాబు మరోసారి వినూత్న ప్రయోగం చేశారు. బంటి అనే పంది పాత్రతో ఏకంగా రెండుగంటల సినిమాను తెరకెక్కించారు. ముందుగా ఆయన ధైర్యాన్ని మొచ్చుకోవాల్సిందే. ఈ క్ర‌మంలో ర‌విబాబు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన చిత్రం `అదుగో`. సాధార‌ణంగా ప్రేమ‌క‌థా చిత్రాలు, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్‌, హార‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ర‌విబాబు అదుగో సినిమా కోసం ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. ఇంత‌కు ఆ ప్ర‌యోగం ఏమంటారా.. లైవ్ యానిమేష‌న్ టెక్నాల‌జీతో పందిపిల్ల‌ను ప్ర‌ధాన పాత్ర‌ధారిగా సినిమా చేయ‌డ‌మే. ఈ సినిమా కోసం దాదాపు రెండున్న‌ర సంవ‌త్స‌రాల క‌ష్ట‌ప‌డ్డాడు ర‌విబాబు. మ‌రి అదుగో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

క‌థ‌:

ఒక పిల్లాడు ఎంతో ప్రేమగా చూసుకునే బంటి అనే పంది పిల్ల అనుకోకుండా కొరియర్ రూపంలో ఓ కుర్రాడి దగ్గరికి చేరుతుంది. అది పంది పిల్ల అని తెలియక దాన్ని తన ప్రేయసి బహుమతిగా ఇస్తాడా కుర్రాడు. ముందుగా చంటి, బంటి సంగతి చూద్దాం.. అమరావతిలో ఉండే చంటికి(సాత్విక్‌ వర్మ) బంటి (పంది) అంటే ఎంతో ఇష్టం. చాలా ఇష్టంగా బంటిని పెంచుకుంటూ ఉంటాడు. చంటితో ఆడుకుంటూ అనుకోకుండా బంటి విలన్ల చేతికి చిక్కుతుంది. దాన్ని వెతుక్కుంటూ అమరావతి నుండి హైదరాబాద్ వస్తాడు చంటి. ఇది చంటి, బంటి కథ.

విశ్లేష‌ణ‌:

రవిబాబు కథలన్నీ కొంచెం విపరీత స్థాయిలోనే ఉంటాయి. వినోదం పండించడానికి అతను కొంచెం ఎక్స్ ట్రీమ్ ఆలోచనలే చేస్తుంటాడు. ఐతే రవిబాబు విపరీత ఆలోచనలు కొన్నిసార్లు కడుపుబ్బ నవ్విస్తాయి. కొన్నిసార్లు చాలా ఎబ్బెట్టుగా తయారవుతాయి. ‘అదుగో’ రెండో కోవకు చెందిన సినిమా. రవిబాబు లాంటి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న దర్శకుడు ఒక పంది పిల్లను పెట్టి హీరోగా తీస్తున్నాడంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ ఏర్పడింది.

ఇంతలో తను ఊరు వెళ్తూ ఎంతో ముద్దుగా పెంచుకున్న కుక్క పిల్లను అభికి అప్పగించి జాగ్రత్తగా చూసుకోమంటుంది. అభి స్నేహితులు మద్యం మత్తులో ఆ కుక్కపిల్ల జుట్టు కత్తిరించి గుర్తుపట్టలేకుండా చేస్తారు. దాంతో అభి ఆ కుక్కపిల్లలా ఉండే మరో కుక్కపిల్లను ఆన్ లైన్‌లో ఆర్డర్ చేస్తాడు. కాని ఆ బాక్స్‌లో కుక్క పిల్ల ప్లేస్‌లో పంది పిల్ల (బంటి) ఉంటుంది. ఈ పంది పిల్ల రీప్లేస్ చేసి కుక్కపిల్లను తిరిగి తెచ్చి తన ప్రేమను నిలబెట్టుకోవడం కోసం అభి, రాజీలు ప్రయత్నిస్తారు. ఇది అభి, రాజీల కథ

ఇలాంటి కాన్సెప్ట్‌కు ఓ పందిపిల్ల‌కు లింక్ పెట్టి రవిబాబు క‌థ రాసుకున్నాడు. అలాగే త‌న చిత్రాల్లో చూపించే అడ‌ల్ట్ త‌ర‌హాకామెడీని ఈ సినిమాలో కూడా చొప్పించాడు. పందిపిల్ల చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది. హీరో, హీరోయిన్ కూడా అనుకోకుండా పందిపిల్ల‌కు లింక్ ప‌డి ట్రావెల్ అవుతుంటారు. సినిమా ఫ‌స్టాఫ్ ముగియ‌డానికి ముందే క్లైమాక్స్ గురించి ఓ అవ‌గాహ‌న వ‌చ్చేస్తుంది. అయితే ర‌విబాబు ఎంత ఆస‌క్తిగా తెర‌కెక్కించాడో అనేదే పాయింట్‌గా మారింది. అయితే చంటి అనే కుర్రాడికి, పంది పిల్ల‌కు మ‌ధ్య ఎమోష‌న‌ల్ క‌నెక్టింగ్ సీన్స్‌ను మ‌రికొన్నింటిని చూపించి ఉంటే బావుండేద‌నిపించింది. ఇక లైవ్ యానిమేష‌న్‌లో చేసిన పందిపిల్ల విన్యాసాలు ఆక‌ట్ట‌కుంటాయి. ప్ర‌శాంత్ విహారి పాట‌లు బాలేదు. ముఖ్యంగా హీరోయిన్ క‌ష్టంలో ఉంటే.. వీడియో చాట్‌లో హీరో సాంగ్ పాడ‌ట‌మేంటో ..ర‌విబాబుకే అర్థం కావాలి. పోనీ హీరోయిన్‌కి హీరో ప్రేమ‌ను ఎమోష‌న‌ల్‌గా చెబుతున్నాడులే అనుకుంటే.. అప్ప‌టికే హీరో, హీరోయిన్ ప్రేమ‌లో మునిగి ఉంటారు.

నటీనటులు:

నటీనటుల విషయానికి వస్తే చంటి పాత్రలో నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సాత్విక్‌ వర్మ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్లు కాస్త అతి చేసినట్టుగానే అనిపిస్తుంది. రవిబాబు గతచిత్రాల్లో కనిపించిన చాలా మంది నటులు ఈ సినిమాలోనూ రిపీట్‌ అయ్యారు. మిగతా నటీనటులంతా రవిబాబు స్టయిల్లో చేసుకుపోయారు. ఇక పంది పిల్ల గురించి చెప్పాలంటే..  సినిమాలో అది ఎక్కడ ఒరిజినల్ గా కనిపించిందో.. ఎక్కడ యానిమేషనో అర్థం కాదు. కాబట్టి దాని హావభావాల గురించి మాట్లాడలేం.

సాంకేతిక వర్గం:

ప్రశాంత్ విహారి సంగీతం పర్వాలేదు. హీరో హీరోయిన్ల మీద వచ్చే పాట ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతంలో ప్రశాంత్ం మార్కు కనిపించదు. రవిబాబు అభిరుచికి తగ్గ ఔట్ పుట్ ఇచ్చాడు. సినిమాకు తగ్గట్లుగా ఉందది. సుధాకర్ రెడ్డి ఛాయాగ్రహణమూ అంతే. ఇది రవిబాబు సినిమా అని తెలిసేలా కెమెరా వర్క్ సాగింది. నిర్మాణ విలువలు ఏమంత గొప్పగా లేవు. పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునేలా ఉండ‌దు.. ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ కాదు.. క‌న్‌ఫ్యూజింగ్ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం పెద్ద‌గా వ‌ర్కవుట్ కాలేదు. ర‌విబాబు రెండున్న‌రేళ్లు క‌ష్టం వృథాయేనా అనిపిస్తుంది.

చివరగా: అదుగో.. పంది పిల్ల కామెడీ

రేటింగ్‌: 2/5