రివ్యూ : ’24 కిస్సెస్’
Spread the love

న‌టీన‌టులు: అరుణ్ అదిత్, హెబ్బా పటేల్, రావు ర‌మేశ్‌‌, ర‌వివ‌ర్మ, అదితి మ్యాక‌ల్ త‌దిత‌రులు.

స‌ంగీతం: జోయ్ బారువా

ఛాయాగ్ర‌హ‌ణం: ఉద‌య్ గుర్రాల

కూర్పు: అనిల్ ఆల‌యం

క‌ళ‌: హ‌రివ‌ర్మ

నిర్మాణం: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌

ద‌ర్శ‌క‌త్వం: అయోధ్య‌కుమార్ కృష్ణంశెట్టి

సంస్థ‌: రెస్పెక్ట్ క్రియేష‌న్స్

సమ‌ర్ప‌ణ‌: సిల్లీ మంక్స్‌

స్వచ్ఛమైన ప్రేమ భావనల్ని పెదవులతో వివరించే హృదయ సాధనం ముద్దు. భాషే లేని భావాలకి ప్రియ భాష్యం ముద్దు.. ముద్దంటే కేవలం శృంగారంతో ముడిపడింది కాదు. అలాంటి ముద్దుల పైనే ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందోన‌ని అనుకున్నారేమో కానీ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ అయోధ్య‌కుమార్ కృష్ణంశెట్టి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారి చేసిన సినిమా `24 కిస్సెస్‌`. ఒక‌ట్రెండు ముద్దులుంటేనే ఎలాగో వార్త‌లు వ‌చ్చేస్తుంటాయి. అలాంటిది 24 ముద్దుల‌కు సంబంధించిన సినిమా కావ‌డంతో ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. మ‌రి 24 కిస్సెస్ వెను క‌థేంటో తెలుసుకుందాం……

కథ:

ఆనంద్ (ఆదిత్ అరుణ్) ఒక చిల్డ్రన్ ఫిలిం మేకర్. పౌష్టికాహార లోపంతో అల్లాడుతున్న చిన్నారుల కోసం ఏదైనా చేయాలని తపిస్తుంటాడు. సినిమాల ద్వారా ఈ సమస్య గురించి ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రయత్నిస్తుంటాడు. ‘ఒకటి మాత్రం తెలుసు, పిల్లల్నీ, ప్రపంచాన్నీ ఇంతగా ప్రేమించేవాడివి శ్రీలక్ష్మిని ఇంకెంతలా ప్రేమించగలవో నాకు అర్థమైంది నువ్వు లేకుండా నేనుండలేనూ అని. పిల్లలు అంటే ఇష్టం లేద‌నే విష‌యం తెలుస్తుంది. అంతే కాకుండా అప్ప‌టికే త‌న‌కు ఇద్ద‌రు, ముగ్గురితో శారీర‌క సంబంధాలున్నాయ‌ని తెలుసుకుని గొడ‌వ‌ప‌డి త‌న‌ను ఎప్పుడూ క‌ల‌వొద్ద‌ని వెళ్లిపోతుంది. అస‌లు ఆనంద్‌కు పెళ్లంటే ఎందుకు ఇష్టం ఉండ‌దు? పిల్ల‌ల స‌మ‌స్య‌ల గురించి బాధ‌ప‌డే వ్య‌క్తికి పిల్ల‌లంటే ఎందుకు ఇష్టం ఉండ‌దు అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

24 Kisses Movie Review

విశ్లేష‌ణ‌:

ఇద్దరూ శారీరకంగా కూడా ఒక్కటవుతారు. హీరోయిన్ తన ప్రేమను హీరోకు చెబుతుంది. అతనేమో నీది లవ్వో అట్రాక్షనో ఆలోచించుకో అంటాడు. ఆమె ఏమీ హర్టవదు. మళ్లీ అతడితో అలాగే సన్నిహితంగా ఉంటుంది. తర్వాత ఇంకో సందర్భంలో హీరోను.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతుంది. అతను సమాధానం చెప్పడు.

ఇద్ద‌రి మ‌ధ్య బంధానికి ప్రేమ‌, పెళ్లి అనే పేరు పెట్టాల్సిన అవ‌స‌రమే లేద‌నే ఆలోచ‌న‌లున్న క‌థానాయకుడు… ప్రేమ‌పైనా, పెళ్లిపైనా న‌మ్మ‌క‌మున్న క‌థానాయిక మధ్య సంఘ‌ర్ష‌ణే ఈ చిత్రం. ఇద్ద‌రూ శారీర‌కంగా ఒక్క‌ట‌య్యాక భిన్న అభిప్రాయాలున్న వాళ్లు ఎంత దూరం ప్ర‌యాణం చేశార‌నేది క‌థాంశం. దానికి ద‌ర్శ‌కుడు త‌న‌దైన క‌వితాత్మ‌క‌త‌ని జోడించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఆ క‌థ‌నం ఒక ప‌ట్టాన అర్థం కాదు. చివ‌రికి ప్రేమ‌ని రుచి చూశాన‌న్న క‌థానాయ‌కుడు మ‌ళ్లీ పెళ్లి ద‌గ్గ‌రికొచ్చేస‌రికి న‌మ్మ‌కం లేదంటాడు. దాంతో అక్క‌డ పెళ్లెందుకు ఇష్టం లేద‌ని మ‌రో క‌థ ఉంటుంది. ఆ ప్ర‌హ‌సనం అంతా సాగ‌దీత‌గా అనిపిస్తుంది త‌ప్ప వినోదం కానీ, భావోద్వేగాలు కానీ పంచ‌దు. పేరులోనే ముద్దుల్ని చొప్పించిన ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించొచ్చు కానీ… థియేట‌ర్‌లో మాత్రం మెప్పించ‌లేడు. క‌థ‌, క‌థ‌నాల్లో లోపాల వ‌ల్ల తెర‌పై ముద్దులు కూడా తేలిపోయాయి.

నటీనటులు:

కథ’.. ‘తుంగభద్ర’ లాంటి సినిమాల్లో తనేంటో రుజువు చేసుకున్న ఆదిత్.. ‘24 కిస్సెస్’లో కూడా బాగానే చేశాడు. అతడిలో ఈజ్ కనిపించింది. కానీ అతడి క్యారెక్టరే గందరగోళంగా ఉంది. ఇక మెంటల్ డాక్టర్‌గా కథను మొత్తం ప్రేక్షకులను వినిపించిన రావు రమేష్ పాత్ర సీరియస్‌గా నడుస్తుంది అనుకుంటే.. చివర్లో అతన్నీ కమెడియన్‌గా మార్చేశారు. అక్కడక్కడా రావు రమేష్ పంచ్‌లు పేలాయి. హీరోయిన్ తండ్రి పాత్రలో నరేష్ ఆకట్టుకున్నాడు.

సాంకేతికవర్గం:

ఈ ఉత్సవం నీకో సగం నాకో సగం.. పాట వినడానికి బాగుంది. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది. ఉదయ్ గుర్రాల ఛాయాగ్రహణం మామూలుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పేలవంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ వీధిబాల‌లు అనే కాన్సెప్ట్ హెంగోవ‌ర్ నుండి బ‌య‌ట‌కు రాలేదు.

రేటింగ్: 1/5