‘2.ఓ’ సినిమా రివ్యూ
Spread the love

నటీ నటులు : రజిని కాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్

సంగీతం : ఏ.ఆర్.రెహమాన్

సినిమాటోగ్రఫీ : నిరవ్ షా

ఎడిటింగ్ : ఆంటోనీ

నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్

నిర్మాత : సుభాస్కరన్

రచన-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎన్.శంకర్

రజిని కాంత్ కథానాయకుడిగా అక్షయ్ కుమార్ ప్రముఖ పాత్రలో దర్శకుడు ఎన్.శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘2 .0 ‘ గతం లో రజిని కాంత్ తో శంకర్ రూపొందించి అఖండ విజయం అందుకున్న ‘రోబో’ చిత్రానికి కొనసాగింపు గా తెరకెక్కుతున్న చిత్రమిది.మిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఆ నిరీక్ష‌ణ ఫ‌లించింది. 2.ఓ వ‌చ్చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? ర‌జ‌నీ – శంక‌ర్ స్థాయికి త‌గ్గ‌ట్టు సాగిందా? రోబోతో పోలిస్తే 2.ఓలో ఉన్న ప్ర‌త్యేక‌త‌లేంటి?

కథ

భూమ్మీద‌ ఉన్న‌ట్టుండి అంద‌రి సెల్‌ఫోన్లూ మాయ‌మైపోతుంటాయి. చేతిలో ఉన్న సెల్ ఫోన్ సీలింగ్‌ని చీల్చుకుంటూ మ‌రీ ఆకాశంలోకి వెళ్లిపోతుంది. ఈ హఠాత్పరిణామానికి ప్ర‌పంచం మొత్తం నివ్వెర‌పోతుంది. భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తికి మించి ఏదో బ‌ల‌మైన శ‌క్తి సెల్ ఫోన్ల‌ని లాక్కెళ్లిపోతోంద‌ని శాస్త్రవేత్తలు గ్ర‌హిస్తారు. అయితే ఈ సమస్య ఎందుకు ఎదురైంది? ఎలా పరిష్కరించాలో ఎవరికీ అంతుపట్టదు. ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి.. మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు. అయితే సెల్‌ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్న పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌)ను  చిట్టి ఒంటరిగా ఎదురించిందా?  ‘2.ఓ’ రావల్సిన అవసరం ఎందుకు వచ్చింది?

విశ్లేషణ:

శంక‌ర్ ఎప్పుడూ సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుని, వాటిని సాంకేతికంగా ఉన్న‌తంగా చూపిస్తుంటాడు. ఈసారి సాంకేతిక విష‌యాన్నే ఎంచుకోవ‌డం మ‌రింత క‌లిసొచ్చింది. 2.ఓ విష‌యంలో ఆయ‌న సెల్‌ఫోన్‌ల‌పై ఫోక‌స్ పెట్టాడు. సెల్ ఫోన్‌ల వ‌ల్ల వ‌చ్చే శ‌బ్ద‌త‌రంగాల వ‌ల్ల ప్ర‌కృతి ఎంత న‌ష్ట‌పోతోందో, భ‌విష్య‌త్తులో ఎన్ని వినాశాలు చూడాల్సి వ‌స్తుందో… ఈ సినిమాలో క‌ళ్ల‌కు క‌ట్టారు. వాటి చుట్టూ ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకుంటూ ఓ క‌థ అల్లారు. ప్ర‌ధ‌మార్ధంలో సెల్ ఫోన్ల మాయం, ప‌క్షిరాజు చేసే విధ్వంసం వీటిపైనే దృష్టి పెట్టారు.

ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆస్కార్‌ అవార్డు గ్రహీతలు ఏఆర్‌ రెహమాన్‌, రసూల్‌ పూకుట్టి చేసిన మాయ అందరినీ అబ్బురపరుస్తుంది. స్వర మాంత్రికుడు తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేయగా.. ఇండియన్‌ సినిమాలో 4డీ సౌండ్‌ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి రసూల్‌ తీసుకెళ్లారు. నీరవ్‌ షా అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. నిర్మాణ విలువలు లైకా ప్రొడక్షన్స్‌ స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ఆంటోని ఎడిటింగ్‌ పనితనం కూడా ఈ సినిమాకు కలిసివచ్చింది.

నటీనటులు:

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ల చుట్టూనే కథ నడుస్తుంది. ఇందులో సైంటిస్ట్‌ పాత్రలో వసీకరణ్‌గా, చిట్టి, 2.ఓ రోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది. మూడు పాత్రల్లో భిన్నంగా రజనీ చేసిన అద్భుతం అభిమానులకు కన్నులపండువగా ఉంటుంది. అక్ష‌య్ ప‌రిస్థితీ అంతే. ఆయ‌న ప‌క్షిరాజుగా క‌నిపించింది ఎక్కువ‌. నిజ‌మైన రూపాన్ని చూసే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా వ‌చ్చింది. అయితే… అక్ష‌య్ గెట‌ప్ బాగుంది. అమీజాక్స‌న్‌ని మిన‌హాయిస్తే… తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసిన న‌టీన‌టులెవ‌రూ క‌నిపించ‌రు. శంక‌ర్ ఈ సారి క‌థ‌ని ర‌జ‌నీ – అక్ష‌య్‌ల పోరాటం మ‌ధ్యే తిప్ప‌డంతో మిగిలిన పాత్ర‌లు తేలిపోయాయి.

రేటింగ్: 3.0