యాత్ర ట్రైలర్ చూసారా…?
Spread the love

దివంగత నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం“యాత్ర”.ఈ బయోపిక్ లో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్మూటీ నటిస్తున్నారు.అంతేకాకుండా రావు రమేష్, అనసూయ, పోసాని కృష్ణ మురళి, వినోద్ కుమార్, సచిన్ కెడెకర్ సహాయ పాత్రలలో కనిపిస్తారు. 70 మిలియన్ల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రాబోతున్న ఈ చిత్రానికి మాహె వి రాఘవ్ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ చిత్రం నుంచి ఒక టీజర్ విడుదల చేసారు.ఈ టీజర్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ బయోపిక్ ఫిబ్రవరి 8 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.