ప్రభాస్‌ బర్త్డే సందర్భంగా సాహో సినిమా టీజర్‌
Spread the love

బాహుబలి చిత్రం తరువాత మరోసారి ప్రభాస్‌చాలా గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్‌ కొత్త చిత్రం అప్‌డేట్‌ కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నారు . షూటింగ్ ప్రారంభానికి ముందే సాహో చిత్ర టీజర్‌ను విడుదల చేసిన సినిమా బృందం తరువాత కేవలం ఒక్క పోస్టర్‌తోనే సరిపెట్టారు. అయితే ఈ సారి ప్రభాస్‌ పుట్టిన రోజు కానుక టీజర్‌తో అభిమానులకు ట్రీట్‌ ఇవ్వనున్నారట సాహో బృదం .

ఈ నెల 23న ప్రభాస్‌ బర్త్డే సందర్భంగా ఒక్క రోజు ముందుగానే 22న సాహో చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి సాహో టీం ప్లాన్‌ చేస్తున్నట్టుగా సమాచారం . ఇప్పటికే సాహో షూటింగ్‌ పూర్తి చేసిన ప్రభాస్, రాధకృష్ణ డైరెక్షన్ లో మరో చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ కూడా అదే రోజు విడుదల చేసే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది.

యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సాహో చిత్రానికి రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్ డైరెక్టర్ . బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ నీల్‌నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.