వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ విడుదల తేదీ ఖరారు…
Spread the love

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా మహీ వి.రాఘవ దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం ‘యాత్ర’.అప్పట్లో  రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రనే హైలెట్ చేస్తూ…ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు.

తాజాగా చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది.2019 ఫిబ్రవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితను ఎంపిక చేసారు.సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణమురళి, షర్మిల పాత్రం కోసం భూమిక, సబితా ఇంద్రారెడ్డి పాత్రకోసం సుహాసినిను ఎంపిక చేసినట్లు వార్త వినిపిస్తోంది.ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా సాగుతోంది.ఇప్పటికే విడులైన ఫస్ట్ లుక్, టీజర్, స్టిల్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.