“అయోగ్య” ఫస్ట్ లుక్ రీలీజ్…
Spread the love

పూరి జగన్నాథ్ దర్శకత్వం ఎన్టీఆర్ కొత్త కోణంలో నటనను ఆవిష్కరించిన సినిమా “టెంపర్”.ఈ చిత్రంలో కధలో కొత్తదనం కారణంగా అనేక భాషల్లో రీమేక్ చేస్తున్నారు.తమిళ రీమేక్ లో విశాల్ హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి “అయోగ్య”అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఈ సినిమాలో విశాల్ సరసన రాశి ఖన్నా నటిస్తుంది.

వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు.“అయోగ్య” చిత్ర౦ నుంచి తాజాగా ఫస్టులుక్ ను విడుదల చేశారు.పోలీస్ జీప్ పక్కన ఉన్న విశాల్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.మాస్ హీరోగా తమిళనాడు లో విశాల్ కి మంచి క్రేజ్ ఉంది.అందువల్ల ఈ కథ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని విశాల్ భావిస్తున్నాడు.