‘టెంపర్’ తమిళ రీమేక్ లో ‘విశాల్’ లుక్
Spread the love

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జీవితంలో గుర్తుండి పోయే ‘టెంపర్’సినిమా తమిళం మరియు హిందీల్లో ఒకే సారి రీమేక్ అవుతున్న సంగతి తెల్సిందే. హిందీలో షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. తమిళంలో ఈమద్యే షూటింగ్ మొదలయింది.తమిళంలో ఈ రీమేక్ లో కథానాయకుడిగా విశాల్ నటిస్తున్న సంగతి తెల్సిందే. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. చెన్నై వైజాగ్ సాగర తీరంలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు.

షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. మురుగదాస్ చేతుల మీదుగా రిలీజ్ ఐన ‘టెంపర్’ రీమేక్ సినిమా ‘అయోగ్య’ ఫస్ట్ లుక్ విశాల్ అభిమానులను అలరిస్తోంది. పోలీసు జీపు వద్ద చాలా స్టైల్ గా – చేతిలో బీర్ బాటిల్ తో విశాల్ కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ చూస్తేనే విశాల్ క్యారక్టర్ ఏంటో తమిళ ఆడియన్స్ కు అర్థం అవుతోంది. విశాల్ ఈ సినిమా కోసం కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. గత సినిమాలతో పోల్చితే విశాల్ ఈ సినిమాలో సన్నగా కనిపిస్తున్నాడు. విశాల్ ‘అయోగ్య’ సినిమాలో పోసాని పోషించిన పాత్రను కేఎస్ రవికుమార్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సన్నీలియోన్ ఐటెం సాంగ్ ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి .టెంపర్ రీమేక్ తమిళనాట పెద్ద సంచలనం సృష్టించడం ఖాయం అంటూ విశాల్ సన్నిహితులు నమ్మకంగా తెలియజేస్తున్నారు.విశాల్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.