నేడు హీరో విశాల్‌ నిశ్చితార్థం హైదరాబాద్‌లో !
Spread the love

హైదరాబాద్‌కు చెందిన అనీషాను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే.ఇటీవల తను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేశాడు విశాల్‌. తాజాగా సమాచారం ప్రకారం ఈ రోజు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వీరి నిశ్చితార్థం జరగనుందట. అయితే ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరగనుంది.

అందుకే ఎలాంటి ప్రకటన లేకుండా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లా నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు వివాహ తేదిని కూడా ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. విశాల్‌ ప్రస్తుతం టెంపర్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న అయోగ్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.