రియాలిటీ బిహైండ్ ట్యాక్సీవాలా
Spread the love

విజయ్ దేవరకొండ నటించినటువంటి `ట్యాక్సీవాలా` సినిమా విషయంలో జరుగుతున్న ప్రచారం గురించి తెలిసిందే. ఈ మూవీ ఆన్ లైన్ లో లీకైపోయింది. మూవీ మొత్తం చాలా మంది చూశారు. అయినా థియేటర్లలో ఎలా విడుదల చేస్తారు? అంటూ సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించే ప్రచారం జరుగుతోంది . మరోవైపు తమ మూవీని ఎట్టిపరిస్థితిలో గట్టెక్కించాలన్న కసితో దేవరకొండ మరియు బృందం చాలానే శ్రమిస్తున్నారు. విజయ్ దేవరకొండ మరోసారి తనదైన ప్రచారంతో వైవిధ్యానికి పదును పెడుతూ మీడియాలోనూ దర్శనమిస్తున్నాడు.

ట్యాక్సీవాలా ఈనెల 17న విడుదలవుతున్న విషయం తెలిసిందే. రాహుల్ సంకృత్యాయన్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాని యువి క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.మూవీకి యుఏ సర్టిఫికెట్ దక్కింది. తాజాగా ఈ చిత్రంపై సాగుతున్న నెగెటివ్ ప్రచారానికి కౌంటర్ వేస్తూ క్రియేటివ్ గా ఓ వీడియోని విడుదల చేశారు. `రియాలిటీ బిహైండ్ ట్యాక్సీవాలా` పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది.

కొందరు పిల్లలతో ట్యాక్సీవాలా తనదైన స్టైల్లో ముచ్చటిస్తూ అసలు తెరవెనక ఏం జరిగిందో ఆ స్టోరీ అంత చెప్పాడు.చిత్రాల గురించి ముచ్చట్లు పెడుతున్నట్టే పెట్టి అసలు ట్యాక్సీవాలా విడుదల కాకుండా ఎలా చూసేశారు? ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అయినా చేయకుండా.. గ్రాఫిక్స్ అయినా అద్దకుండా .. అసలు విడుదల అన్నదే చేయకుండానే ఎలా చూసేశారు? అంటూ దేవరకొండ ప్రశ్నించాడు. పోస్ట్ ప్రొడక్షన్.. ఎడిట్.. సౌండ్ .. వీఎఫ్ ఎక్స్ .. అదింకా పూర్తి కాని మూవీ అంటూ చెప్పడం చూస్తుంటే జనాలకు తెలివిగానే క్లారిటీ ఇచ్చాడు.