కాజల్ తో విజయ్ దేవరకొండ నిజమేనా….?
Spread the love

టాలీవుడ్ లో చాలా సంవత్సరాల నుంచి అనేక చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన హీరోయిన్ కాజల్ అగర్వాల్.ఈమె తో పోలిస్తే మాత్రం విజయ్ దేవరకొండ చాలా జూనియర్.అయినా ఈ ఇద్దరూ కలిసి త్వరలో ఒకే స్క్రీన్ ఫై కనిపించబోతున్నట్లు సమాచారం.తెలుగులో మంచి గుర్తింపు తెచుకున్న  ఓనమాలు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాలతో మంచి దర్శకుడు అనిపించుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ- కాజల్ అగర్వాల్ జంట కలిసి  నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్.

కథల ఎంపిక విషయా౦ లో విజయ్ కి మంచి టేస్ట్ ఉందనే విషయం పెళ్లిచూపులు – అర్జున్ రెడ్డి లాంటి చిత్రాలను చూస్తే అర్ధం అవుతుంది.తాజా గా విజయ్ నటించిన “గీత గోవిందం” సినిమా విడుదల కు సిద్దం గా ఉంది.అంతే కాకుండా “టాక్సీవాలా” సినిమా తో కూడా ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దం అవుతున్నారు.ఈ రెండు చిత్రాలు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాయి.

ఆ రెండు చిత్రాల తరువాత విజయ్ చిత్రం  క్రాంతి మాధవ్ దర్శకత్వం లో నటించే అవకశం తెలుస్తుంది.క్రాంతి మాధవ్ చెప్పిన కథ విజయ్ మరియు కాజల్ కు విపరీతం గా నచ్చడం తో వెంటనే ఓకే చెప్పారంట.ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏదో ఉన్నట్లు తెలుస్తుంది.మరి ఆ కారణం ఏంటో సినిమా మొదలయ్యాక తెలిసే అవకాశం ఉంది.ఏది ఏమైనా గాని వీరిద్దరు జంటగా నటిస్తున్నారు అనే విషయం  మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ఫై  K.S రామారావు ఈ సినిమా ను  నిర్మిస్తున్నట్టు సమాచారం.