‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ‘వెన్నుపోటు’ పాట విడుదల…
Spread the love

ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లోని ‘వెన్నుపోటు’ పాటను ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఆ పాటకు సంబంధించిన వీడియోను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా రచయిత సిరాశ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు కల్యాణి మాలిక్ లకు రామ్ గోపాల్ వర్మ ధన్యవాదాలు తెలియజేసాడు.

‘దగా…దగా.. మోసం..నమ్మించి.. వెన్నుపోటు పొడిచారు. వంచించి..వంచించి వెన్నుపోటు పొడిచారు. కుట్ర..కుట్ర..కుట్ర..’ అంటూ ఈ పాట కొనసాగింది.ఈ పాట వినపడుతుండగా నాడు ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి ఉన్న కొన్ని దృశ్యాలు కనపడటం గమనార్హం.