తేజు తమ్ముడు వైష్ణవ్ ఎంట్రీ బ్రేక్ పడినట్టే…..
Spread the love

ఇటీవలే రవితేజతో నేల టికెట్టు నిర్మించిన రామ్ తాళ్ళూరి తోడు బాడీ అండ్  హెయిర్ మేకోవర్ కోసం అమెరికా వెళ్లిన సాయి ధరమ్ తేజ్ కు అండగా రామ్ తాళ్ళూరినే దగ్గరుండి చూసుకుంటున్నారు అని వార్త వచ్చింది. కానీ అవన్నీ తిసిపడేస్తున్నారు రామ్ తాళ్ళూరి. ప్రస్తుతానికి మెగా హీరో సాయి ధరమ్ వైష్ణవ్ తేజ్ ని లాంచ్ చేసే ఆలోచన గురించి ఇప్పుడే చెప్పలేమని వచ్చిన ప్రచారాలన్నీ అవాస్తవమని తిసి పారేస్తున్నారు.

ఇప్పుడే ఏ విషయం చెప్పలేం ప్రస్తుతానికి అవాస్తవం అంటున్నారు కానీ పూర్తిగా అసలు ఛాన్స్ లేదు అని అనడం లేదు. అయితే ఇప్పుడు కాకపోయినా ముందు ఉండే అవకాశం అయితే ఉంది కదా. అసలే సాయి ధరమ్ తేజ్ స్వయంగా బ్యాడ్ టైం లో ఉన్నాడు, వరసగా తగిలిన ఆరు బాక్స్ ఆఫీస్ దెబ్బల నుంచి కోలుకోవడానికి కొంత టైం పట్టేలా ఉన్నది. ఈ టైంలో వైష్ణవ్ తేజ్ ని పరిచయ౦ చేయటం అంత కరెక్ట్ కాదు. అందుకే కాస్త ఆగి చూసే ధోరణిలో తేజు ఫ్యామిలీ ఉన్నట్టు కనిపిస్తోంది. మరోపక్క వైష్ణవ్ యాక్టింగ్ పరంగా శిక్షణ కూడా పూర్తి చేస్కున్నాడు. కళ్యాణ్ దేవ్ విజేత ఫలితం చూసాక ఎలాంటి కథతో పరిచయం చేయాలి అనే దాని గురించి తొందరపకుండా ఆలస్యంగానే వైష్ణవ్ ని సినిమాల్లో తీసుకొచ్చేలా చూస్తున్నారు. సో తేజు తమ్ముడి కథకు కాస్త బ్రేక్ పడినట్టే.