మామ డ్యూటి చేస్తున్న రామ్ చరణ్: ఉపాసన
Spread the love

రామ్ చరణ్ భార్య ఉపాసన ఎప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో రామ్ చరణ్ షూటింగ్ విషయాలనే కాకుండా..పర్సనల్ విషయాలను కూడా పంచుకుతుంది.చెర్రీ కూడా పర్సనల్ విషయాలను ఉపాసన ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు.ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు.

నిన్న ఉపాసన తో కలిసి డ్రైవ్‌కి వెళ్లిన రామ్ చరణ్…సాయంత్రం మామగా డ్యూటి నిర్వహించారట.ఈ విషయాన్ని భార్య ఉపాసన తన ట్విటర్ ద్వారా తెలిపారు. రామ్ చరణ్ తన మేనకోడలితో కేక్ కట్ చేయించే ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది.”మామ డ్యూటీస్.. హ్యాపీ బర్త్ డే” అంటూ ట్వీట్ చేశారు.

ఆ ఫోటోలో రామ్ చరణ్ మేనకోడలితో పాటు అల్లు ఆయాన్, మరికొందరు చిన్నారులు కనిపిస్తున్నారు.ఆ ఫోటోలో ఆయాన్ కేక్‌ ను చూస్తు౦డటంతో అభిమానుల౦తా…“అల్లువారబ్బాయి దృష్టంతా కేక్‌పైనే ఉంది” అంటూ అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.