ఎన్టీఆర్ బయోపిక్ లో… స్టార్ల కళకళ
Spread the love

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ స్టార్స్ తో నిండిపోతుంది. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జులై 5 నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో దర్శకుడు క్రిష్ బిజీగా ఉన్నారు. తండ్రి ఎన్ టీఆర్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు. ఎన్ టీఆర్ భర్త బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, నాదెండ్ల బాస్కర్ రావు పాత్రలో బాలీవుడ్ నటుడు సచిన్ కేడ్కర్, చంద్రబాబు పాత్రలో రానా దగ్గుపాటి, ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య కనిపించబోతున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఒకే సమయంలో తెరను ఏలినారు. ఎన్ టీఆర్ బయోపిక్ లో కృష్ణ పాత్రని కూడా ఉండనుంది. ఆ పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. ఇప్పటికే క్రిష్ మహేష్ తో మాట్లాడి.. ఒప్పించినట్టు తెలుస్తోంది. ఇక, ఎన్ టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తీసుకొచ్చేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి భాగంలో ఎన్ టీఆర్ సినీ జీవితాన్ని, రెండో భాగంలో రాజకీయ జీవితాన్ని చూపించబోతున్నట్టు చెబుతున్నారు.

Tollywood actors are playing roles in NTR biopic

శర్వానంద్‌ లాంటి యువ కథానాయకుల పేర్లూ.. పరిశీలనలో ఉన్నాయి. మరికొన్ని పాత్రల కోసం బెంగాలీ నుంచి నాటక రంగంలో ఉద్దండులైన వారిని పిలిపిస్తున్నారట. కొన్ని పాత్రల కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్‌ ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. మొత్తానికి ప్రతీ పాత్రపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి, ఒక్క సీన్‌లో కనిపించే వేషమే అయినా… జనాదరణ ఉన్నవారితోనే చేయించాలని భావిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. అందుకే అక్కడి నటీనటులు కూడా కనిపించే అవకాశం ఉంది. అలా ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌ స్టార్లతో నిండిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఈ బయోపిక్ ని వచ్చే యేడాది సంక్రాతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.