‘సైరా’లో వీరనారి లక్ష్మీబాయ్ గా టబు
Spread the love

చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలకు చెందిన నటీనటులు వివిధ పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ భారీ చిత్రంలో టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ వెళ్లి స్థిరపడిన టబు కూడా యాడ్‌ అయ్యారని సమాచారం. ‘సైరా’ సినిమాలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా కనిపించనున్నారట. స్వాతంత్య్ర సమరంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితోపాటు ఓ ముఖ్యమైన ఘట్టంలో ఝాన్సీ లక్ష్మీబాయ్ కూడా ఉన్నారట. దాంతో ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని ఆలోచించిన చిత్ర యూనిట్‌కి టబు పేరు స్ఫురించిందట. వెంటనే ఆమెను స్రంపదించడం, ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. తెలుగులో టబు సినిమా చేసి పదేళ్ళు దాటుతోంది. ఈ సినిమాతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేస్తుందని చెప్పొచ్చు. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తుందని చిత్రబృందం పేర్కొంది. రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అమిత్‌ త్రివేది.