టెంపర్ తమిళ్ రీమేక్ లో సన్నీలియోన్ ఐటమ్ సాంగ్…
Spread the love

పూరి జగన్నాథ్ దర్శకత్వం ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా“టెంపర్”.ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన నటనలో కొత్త కోణాన్ని చూపించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళ భాషలో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.టెంపర్ చిత్రంలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అనే ఐటమ్ సాంగ్ దుమ్మురేపేసింది. తమిళ భాషలో కూడా ఈ పాటను రీమేక్ చెయ్యబోతున్నారు.

“టెంపర్”తమిళ రీమేక్ లో హీరోగా విశాల్ నటిస్తున్నాడు.తమిళ౦లో ఈ చిత్ర౦ ‘అయోగ్య’ పేరుతో రూపొందుతోంది.ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం సన్నీలియోన్ ను ఎంపిక చేసారు.ఆ ఐటమ్ సాంగ్ కి సన్నీలియోన్ కు భారీ పారితోషికాన్ని ఇస్తున్నట్లు సమాచారం.“టెంపర్”లాగానే తమిళంలోను ఈ పాట ‘అయోగ్య’ సినిమాకి హైలైట్ గా నిలవాలని విశాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట.ఈ చిత్రం లో విశాల్ సరసన జంటగా రాశి ఖన్నా నటిస్తుంది.వెంకట్ దర్శకత్వం వహిస్తున్నాడు.