వైఎస్ఆర్  బయోపిక్ లో  సీనియర్  హీరోయిన్?
Spread the love

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్ రెడీ యాత్ర అనే టైటిల్ సెట్ చేసి సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మరికొన్ని పాత్రలకు సంబందించిన నటీనటులను ఎంపిక చేయడంలో దర్శకుడు మహి వి రాఘవ బిజీగా ఉన్నాడు. వైఎస్ ఆర్ పాత్రలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి  నటిస్తున్న సంగతి తెలిసిందే. యాత్ర కు సంబందించిన ఫస్ట్ లుక్ కూడా అందరిని ఆకట్టుకుంది.

మమ్ముట్టి  గెటప్ కూడా వైఎస్సార్ కు తగ్గట్టుగా ఉందని టాక్ వచ్చింది. ఇకపోతే దర్శకుడు ఇటీవల ఒక ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ నటిని ఎంచుకున్నాడు. సీనియర్ హీరోయిన్ డైరెక్టర్ మణిరత్నం సతీమణి సుహాసిని ని ఒక పాత్ర కోసం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వెలిగిన సబితా ఇంద్రారెడ్డి క్యారెక్టర్ కోసం ఒకే చేసినట్లు సమాచారం. సుహాసిని ఈ మధ్య వెండితెరకు దూరంగా ఉంటున్నారు. బహుశా నచ్చిన పాత్రలు రావట్లేదు అనుకుంటా. ఇకపోతే మొత్తానికి సబితా రెడ్డి మంత్రిగా వైఎస్ హయాంలో కీలకంగా ఉన్న నాయకురాలు కావున ఆ పాత్రకు సినిమాలో ప్రాముఖ్యత ఉంటుంది.

ఇక వైఎస్ కూతురు షర్మిల పాత్ర కోసం భూమికను అనుకున్నట్లు టాక్ వచ్చినా భూమిక ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది. దర్శకుడు కూడా షర్మిల సీన్స్ యాత్ర సినిమాలో లేవని చెప్పి డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. ఇక వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళిని ఎంచుకున్నారు. వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫెమ్ ఆశ్రితను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.