టాలీవుడ్ లో మరో ప్రొడక్షన్ హౌస్
Spread the love

తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు సుధీర్‌బాబు. ఇప్పుడు ఆయన ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌’ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌ లాంచ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘తన సమర్థత మీద ప్రయాణించే మంచి మనసున్న వ్యక్తి సు«ధీర్‌బాబు.  ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌’ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను’’అన్నారు. ‘‘సుధీర్‌బాబు నిర్మాత అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.

సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా సుధీర్‌బాబు పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను’’అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. సుధీర్‌బాబు మాట్లాడుతూ–‘‘ ఏదో ఒకరోజు నేను ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసే స్టేజ్‌లో ఉంటే కొత్తవాళ్లను తీసుకుని ఒక సినిమా ప్రొడ్యూస్‌ చేయాలనుకున్నా. అలాగే స్టార్ట్‌ చేశా. కృష్ణగారు, మహేశ్‌ వాళ్లను వాడేసుకుని ఎప్పుడూ సినిమాలు చేయాలనుకోలేదు. సొంతంగా ఎదగాలని కోరుకుంటాను. అందులో ఒక తృప్తి ఉంటుంది. నేను ప్రొడక్షన్‌ హౌస్‌ పెట్టడానికి అదే రీజన్‌. మంచి సినిమాలు, జనాలకు గుర్తుండే సినిమాలు చేయాలన్నదే నా విజన్‌. ప్రొడ్యూసర్‌ అవుతానని అనుకోలేదు.

అయ్యా. దర్శకుణ్ణి కూడా అవుతానేమో. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. బయటి ప్రొడక్షన్‌లో కూడా నటిస్తాను. మా బ్యానర్‌లో రాబోతున్న తొలి సినిమా షూటింగ్‌ ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకత్వంలో తుదిదశకు చేరుకుంది. మంచి సందర్భం చూసుకుని ఇలాగే గ్రాండ్‌గా ఈ సినిమా గురించి ప్రకటిస్తాం. ఇప్పుడు ఏ విషయం ఎనౌన్స్‌ చేయడం లేదు. ఎందుకంటే నేను హీరోగా చేసిన ‘సమ్మోహనం’ సినిమా రిలీజ్‌ అవుతుంది. అందుకే ప్రేక్షకులను కన్‌ఫ్యూజ్‌ చేద్దామనుకోవడం లేదు. అందుకే బ్యానర్‌ లాంచ్‌ వరకు మాత్రమే పెట్టాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సందీప్‌ కిషన్, దర్శకులు వంశీ పైడిపల్లి, శ్రీరామ్‌ ఆదిత్య, నిర్మాతలు లగడపాటి శ్రీధర్, అనిల్‌ సుంకరలతోపాటు చైతన్య తదితరులు పాల్గొన్నారు.