హాట్ బ్యూటీ ‘కైరా’ తో ‘బన్ని’
Spread the love

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తరువాత చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయబోతున్న విషయం తెలిసిందే. కాంబినేషన్ ఫిక్స్ అయింది కాబట్టి ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి కథానాయిక ఎంపిక పై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాడట గురూజీ. ఆయన ప్రతి చిత్రంలోనూ టాప్ లీగ్ కథానాయికలనే తీసుకుంటాడు.. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడట.

బన్నీ కి హాట్ బ్యూటీ కియారా అద్వాని ని జోడీగా కుదిర్చే పనులలో ఉన్నాడట. ఇప్పటికే కియారాను ఈ విషయంలో సంప్రదించారట. బాలీవుడ్ హీరోయిన్ అయిన కియారా మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ లో కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కాకుండా కియారా హిందీ లో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ లో షాహిద్ కపూర్తో నటిస్తోంది. అల్లు అర్జున్ మూవీ ఆఫర్ కు నో చెప్పే అవకాశం ఉండదు కాబట్టి కియారా ఈ మూవీకి కథానాయికగా దాదాపుగా ఫిక్స్ అయినట్టే.

బన్నీ-త్రివిక్రమ్ మూవీ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. బన్నీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత చాలా గ్యాప్ తీసుకోవడం వల్ల ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడట.