‘సైరా’లో బన్ని
Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో స్టార్ కథానాయకుడు బన్నీ భాగస్వామి కానున్నాడట .అయితే నటించడం లేదు కానీ బన్నీ గొంతును వాడబోతున్నారని తెలుస్తుంది .

ఈ చిత్రం వాయిస్ ఓవర్‌తో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ వాయిస్ ఓవర్‌ను బన్నీతో చెప్పిస్తారని సమాచారం . స్టైలిష్ స్టార్ వాయిస్ ఓవర్ ఇస్తే చిత్రానికి ప్లస్ అవుతుందని.. దర్శకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. దీనికి అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం . ఈ సినిమాలో నయనతార, అమితాబ్ .. జగపతిబాబు .. సుదీప్ విజయ్ సేతుపతి నటిస్తున్నారని తెలిపారు.