డబ్బు వల్లే కలసి జీవిస్తున్నాం అనిపిస్తోంది: శ్రీముఖి
Spread the love

ఎప్పుడూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే యాంకర్ శ్రీముఖి తీవ్ర ఆవేదనకు గురైంది. సమాజంలో మానవత్వం మంటకలిసి పోతోందంటూ ఆవేదన భరితంగా ట్వీట్ చేసింది. ‘మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా? అని గతంలో నన్ను చాలా మంది అడిగారు. కానీ వారి అభిప్రాయంతో అప్పుడు నేను ఏకీభవించలేదు. కానీ, ఇప్పుడు నాకు అనుభవమైంది. మనం కలసి ఉండటానికి, కలసి జీవించడానికి డబ్బే కారణం అనిపిస్తోంది. జనాల్లోని మానవత్వం మొత్తం నశించేలోపు… ఈ ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తా’ అంటూ ట్వీట్ చేసింది. అయితే దాని వెనక ఉన్న కారణం ఏమిటనేది శ్రీముఖి వెల్లడించలేదు.