మరణం తరువాత కూడా ఆగని సంపాదన
Spread the love

పాప్‌ రారాజు మైఖెల్‌ జాక్సన్‌ మరణించి కొన్ని సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ అత్యధికంగా సంపాదిస్తున్నటువంటి డెడ్‌ సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌.. చనిపోయిన తర్వాత కూడా డబ్బులు సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేసింది. అందులో మైఖెల్‌ జాక్సన్‌ మొదటి స్థానంలో ఉన్నారు. జాక్సన్‌ పోయిన సంవత్సరం 400 మిలియన్‌ డాలర్లు సంపాదించారు. అదెలాగంటే.. లండన్‌కు చెందిన ఈఎంఐ మ్యూజిక్‌ కంపెనీలో జాక్సన్‌కు వాటాలు ఉన్నాయి.
జాక్సన్‌ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ అన్నీ దాదాపు ఈఎంఐ సంస్థే కొనుగోలు చేసింది. జాక్సన్‌కు చెందిన ప్రైవేట్‌ ఏజెంట్ల ద్వారా ఈ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను సోనీ సంస్థ 287 మిలియన్‌ డాలర్లకు కొనడం జరిగింది .ఈ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ అమ్మకాల ప్రక్రియ ద్వారా జాక్సన్‌ పరోక్షంగా దాదాపు 400 మిలియన్‌ డాలర్లు పొందాడు . అలా 2009లో మరణించిన జాక్సన్‌ ఇప్పటివరకు 1.8 బిలియన్‌ డాలర్స్‌ను సంపాదించారు. ఆ తర్వాతి స్థానంలో మ్యూజిక్‌ లెజెండ్‌ ఎల్విస్‌ ప్రెస్లే చేరడం జరిగింది . 1977లో చనిపోయిన ఎల్విస్‌ ఇప్పటివరకు 31 మిలియన్‌ డాలర్లు సంపాదించారు.

మూడో స్థానంలో ప్రముఖ గోల్ఫ్‌ ఆటగాడు ఆర్నాల్డ్‌ పామర్ ఉన్నారు. 1929లో చనిపోయిన ఆర్నాల్డ్‌ ఇప్పటివరకు 27 మిలియన్‌ డాలర్లు సంపాదించారు. నాలుగో స్థానంలో ప్లేబాయ్‌ సంస్థ వ్యవస్థాపకుడు హ్యూగ్‌ హెఫ్నర్‌ ఉన్నారు. 2017లో చనిపోయిన ఆయన సంవత్సరం లో 11.7 మిలియన్‌ డాలర్లు సంపాదించారు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రముఖ గాయకుడు బాబ్‌ మార్లే, రచయిత స్యూస్‌, గాయని మార్నిల్‌ మన్రో ఉన్నారు.