“సంజు” పై సెక్స్‌ వర్కర్ల అభ్యంతరం
Spread the love

సెక్స్‌ వర్కర్ల మనోభావాలను దెబ్బతీశారంటూ బాలీవుడ్‌ చిత్రం సంజు పై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. చిత్ర ట్రైలర్‌లో ఓ డైలాగ్‌ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు NCWలో  ఫిర్యాదు చేశారు. చిత్ర ట్రైలర్‌లో మీ భార్యతో కాకుండా ఎంత మందితో పడుకున్నారంటూ అనుష్క రణ్‌బీర్‌ ను అడుగుతుంది.దానికి స్పందిస్తూ.. వేశ్యలతో కలుపుకుని చెప్పాలా? లేక.. అంటే వారిని మినహాయించి చెప్పాలంటే 308 మందితో అంటూ సమాధానం చెప్తాడు.

ఈ డైలాగ్‌ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ కొందరు  సెక్స్‌ వర్కర్లు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యమకారుడు, న్యాయవాది అయిన గౌరవ్‌ గులాటి సెక్స్‌ వర్కర్ల తరపున NCWలో ఫిర్యాదు చేశారు.ఈ విషయాన్ని చైర్‌పర్సన్‌ రేఖా శర్మ బుధవారం మీడియాతో ధృవీకరించారు.చిత్రంలో ఓ డైలాగ్‌పై అభ్యంతరం వ్యక్తం అయ్యింది.ఎలక్ట్రానిక్‌ మీడియా మానిటరింగ్‌ సెంటర్‌కు ఈ ఫిర్యాదును పంపించాం. వారిచ్చే నివేదిక మీదే చర్యలు ఆధారపడి ఉంటాయి అని ఆమె స్పష్టం చేసారు. కాగా రణ్‌బీర్‌ కపూర్‌, పరేష్‌ రావెల్‌, మనీషా కోయిరాలా, సోనమ్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటించిన సంజు రేపు అంటే జూన్‌ 29న విడుదల కానుంది.