‘కేజీఎఫ్’ లిరికల్ సాంగ్ చూసారా..?
Spread the love

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యశ్ కాంబినేషన్ లో ‘కేజీఎఫ్’ సినిమా త్వరలో రాబోతుంది.ఈ చిత్రాన్ని  కన్నడ,తెలుగు,తమిళ,మలయాళ౦,హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొంది౦చారు.’కేజీఎఫ్’ చిత్రాన్ని ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.తెలుగు పాటలకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.

తాజాగా తెలుగు లో ‘సలామ్ రాఖీ భాయ్’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.జగమేలుతోన్న సుల్తాను వీడే .. జగడానికొస్తే సైతాను వీడే…ఇటీవల విడుదలైన ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది.తాజాగా విడుదల చేసిన ఈ లిరికల్ సాంగ్ సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది.