NTR బయోపిక్‌పై రూమర్లకు చెక్
Spread the love

టాలీవుడ్‌లో బయోపిక్‌ల నిర్మాణం జోరుగా సాగుతుంది.ఇటివలే మహానటి ఘన విజయం సాధించినది.అలాగే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నది.అంతేకాకుండా బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితఆధారంగా హీరో సుధీర్ బాబు మరో బయోపిక్‌ను రూపొందించే౦దుకు సిద్దమయ్యారు.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌పై వస్తున్న రూమర్లకు చిత్ర యూనిట్ చెక్ పెట్టింది.

గత కొన్ని రోజులగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రాబోతుంది.మొదటి పార్ట్ ను సంక్రాంతి 2019 లో, రెండో భాగాన్ని 2019 మధ్య భాగంలో రిలీజ్ చేస్తారు అని మీడియాలో చాలా కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం రెండు భాగాలు ఉండదు అని చిత్ర యూనిట్ స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పారు.ఎన్టీఆర్ బయోపిక్ జూలై 5వ తేదీ నుంచి హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో నిర్విరామంగా షూటింగ్ మొదలవుతుంది.ఎన్టీఆర్ పాత్రలో తనయుడు బాలకృష్ణ స్వర్గీయ రామారావు సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తారు అని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

 ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రను పోషించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషిస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ మేరకు రానాతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని తెలిపారు.ఎన్టీఆర్ బయోపిక్‌లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూడా తన తండ్రి పాత్రలో నాగచైతన్య తన తాత అక్కినేని పాత్రలో కనిపిస్తారు.సూపర్ స్టార్ కృష్ణ పాత్రను పోషించడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ చిత్ర తొలిభాగంలో సూపర్‌స్టార్ కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయని పేరొంటున్నారు. 


ముందుగా ఎన్టీఆర్ బయోపిక్‌ కోసం దర్శకుడిగా తేజను అనుకొన్నారు.కానీ కొన్ని కారణాల వల్ల తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం జరిగింది. తేజ స్థానంలో దర్శకుడు క్రిష్ జాగర్లముడి దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు.గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150, మహానటి చిత్రాలకు మాటలు అందించిన బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి మాటల రచయితగా పనిచేస్తున్నారు.మరి ఎన్టీఆర్ బయోపిక్‌ ఎప్పటికి పూర్తి అవుతుందో చూడాలి.