రేణుదేశాయ్.. ట్రైలర్ ను చూడండి..!
Spread the love

రేణుదేశాయ్ ఈ రోజు ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును షేర్ చేసారు… దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన ‘మిట్టీ’ చిత్రం ట్రయిలర్ ను చూడాలని కోరారు. ఆమె ఆ పోస్టును పెట్టి, “మనకు జీవనాధారం రైతులే. దేశంలో రైతుల మేరుకోరే కొందరు నిర్మించిన చిత్రం ట్రయిలర్ లింక్ ను నేను పంచుకుంటున్నాను. దీన్ని చూడండి” అని వ్యాఖ్యానించింది. దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, పంటలు పండక, తీసుకున్న అప్పులు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక మధనపడే రైతన్నల కుటుంబాలు, ఒక సీజన్ లో మంచి ధర వచ్చిందని, అప్పు చేసి డబ్బు తెచ్చి, పత్తి పంటను వేసి, వర్షాలు కురవక పంట నష్టపోతున్న రైతన్నల వ్యధలను ఈ ట్రయిలర్ లో ప్రస్తావించారు.

Farmers are our life line. Sharing the link of a film made by people who truly care for the well being of farmers in our country. Please do watch. Thank you 😊

Posted by Renu Desai on Monday, 15 October 2018