ముంబయి రిసెప్షన్‌ కార్యక్రమంలో ‘దీప్‌వీర్’
Spread the love

బాలీవుడ్‌ నూతన వధూ వరులు దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ బుధవారం రాత్రి ముంబయిలో ఘనంగా పెళ్లి విందును ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ‘దీప్‌వీర్’ మరోకసారి తమ దుస్తులు, అలంకరణతో అలరించారు.ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అబుజానీ సందీప్‌ ఖోస్లా డిజైన్‌ చేసిన చికంకారీ చీరను ధరించారు. రణ్‌వీర్‌ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ డిజైన్‌ చేసిన షేర్వాణీని ధరించారు. ఒకే రకమైన కలర్‌ లో దీప్‌వీర్‌ జంట చూడముచ్చటగా ఉంది. వీరిద్దరూ జంటగా నటించినటువంటి ‘బాజీరావ్‌ మస్తానీ’ సినిమాలోని స్టిల్‌లోనే మరోసారి ఫొటోలకు పోజులిచ్చారు.
రాత్రి ఎనిమిది గంటలకు మొదలైన ఈ కార్యక్రమానికి ముంబయిలోని దీపిక, రణ్‌వీర్‌ కుటుంబీకులు వచ్చారు . మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. ఇటీవల 21న బెంగళూరులో తొలి వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. డిసెంబర్‌ 1న మరో పెళ్లి విందును ఇవ్వనున్నారు. ఈ విందులో బాలీవుడ్‌కు చెందినటువంటి అతిరథ మహారథులు పాల్గొననున్నారు