చంద్రబాబు గారి పాత్ర చేయడం చాలా కష్టం: రానా
Spread the love

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తన తండ్రి పాత్రను పోషిస్తున్న “ఎన్టీఆర్” బయోపిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రాన్ని బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం చాలా మంది ప్రముఖ నటులను చిత్రబృందం ఎంచుకుంది.ఈ చిత్రంలో బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్,శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్,అక్కినేని నాగేశ్వరరావు పాత్రను సుమంత్,జయప్రద పాత్రను తమన్నా హరికృష్ణగా ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ పోషిస్తున్నారు.అయితే ప్రముఖమైన చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నాడు.

ప్రస్తుతం రానా “నంబర్ వన్ యారీ” సీజన్ 2 ప్రమోషన్స్‌ లో ఉన్న రానా ఒక ఛానల్‌తో మాట్లాడుతూ..ఆసక్తికరమైన  సమాధానమిచ్చాడు.‘‘నారా చంద్రబాబు గారి పాత్ర చేయడం చాలా కష్టం.అది ఛాలెంజింగ్ పాత్ర.అయితే దర్శకుడు క్రిష్ లాంటి స్నేహితుడి అండతో.. ఆ కష్టాన్ని అధిగమిస్తున్నా’’అని తెలిపారు.ఈ సందర్భంగా స్నేహితుల వల్లే నిర్మాణ,నటన రంగాల్లో రాణించగలుగుతున్నానని రానా వెల్లడించారు.