మెగా స్టార్- రామ్ చరణ్ అభిమానులకు గిఫ్ట్ ఆ రోజేనట…
Spread the love

మెగా స్టార్ చింజీవి.. తెలుగు వెండితెర ఇలవేల్పుగా అరాదిస్తారు అభిమానులకు ఎంతో ఇష్టమైన ఈ కదనాయకుడు 9 ఏళ్లు చిత్రాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లడంతో అంతా నిరుత్సహం చెందారు. కానీ మళ్లీ తిరిగి చిత్రరంగంలోకి రావడం.. ఖైదీనంబర్ 150తో అలరించాక ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు. తనదైన మార్క్ సినిమాతో అలరించబోతున్నారు. బ్రిటీష్ వారిని ముప్పుతిప్పలు పెట్టిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హడావిడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అభిమానులకు సప్రైజ్ ఇచ్చేందుకు చిరంజీవి సిద్ధమయ్యాడనే వార్త ఫిలింనగర్ లో షికార్లు కొడుతుంది.

స్టార్ హీరోల బర్త్ డే అంటే అభిమానులకు పండుగే.. వారు నటిస్తున్న సినిమా విశేషాలు  టీజర్లు  ఫస్ట్ లుక్ అప్పుడే విడుదల చేస్తారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా వస్తోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజున సైరా టీజర్ – లేదా ఫస్ట్ లుక్ వస్తుందని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. సినిమా బృందం కూడా మెగా అభిమానుల ఆశల్ని నీరుగార్చకూడదనే ఉద్దేశంతోనే టీజర్ విడుదలకు సిద్ధమవుతోందనే వార్త ఫిలింనగర్ లో శికార్లు కొడుతోంది. అయితే దీనిపై అధికారికంగా మాత్రం చిత్ర యూనిట్ స్పందించ లేదు.

ఇక తండ్రి మాత్రమే కాదు.. కొడుకు రాంచరణ్ కూడా అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ గ ఉన్నడాట. రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఆగస్టు22న మెగాస్టార్ పుట్టిన రోజున అయితే సైరా ఒకవేళ అది తప్పితే రాంచరణ్ మూవీ ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట అన్ని కుదిరితే అటు మెగాస్టార్ ఇటు మెగా పవర్ స్టార్ చిత్ర సంగతులు రెండు విడుదలయ్యే అవకాశం ఉందట. ఒకవేళ ఇదే జరిగితే ఆ రోజు మెగా అభిమానులకు పండుగే పండగ..