పవన్ కి నాదెండ్ల వెన్నుపోటు తప్పదు… వర్మ కామెంట్స్!
Spread the love

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వరుసగా ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న వర్మ..తాజాగా మరోసారి పవన్ అభిమానులను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశాడు. కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ వెంట మనోహర్ ఉంటూ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వర్మ మనోహర్ ఫై ఓ ట్వీట్ చేసాడు. పవన్ కళ్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తారేమో అంటూ సందేహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు.. అప్పటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టు, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాన్‌కు వెన్నపోటు పొడవకుండా ఉండాల్సిందిగా తాను తిరుపతి బాలాజీని వేడుకుంటున్నానంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో ప్రసంగాలు చేస్తున్న ప్రతిసారీ.. పక్కనే ఉంటున్న నాదెండ్ల మనోహర్ చిరునవ్వులు చిందిస్తున్నారని, గతంలో ఎన్టీఆర్ వెనుక ఉంటూ నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఇలాగే చేశారని రామ్ గోపాల్ వర్మ ఆరోపించారు. వెన్నుపోటు నుంచి ఎన్టీఆరే కాదు పవన్ కళ్యాన్ కూడా తప్పించుకోలేడని రామ్ గోపాల్ వర్మ జోస్యం చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఈ విషయాన్ని జనసేనానికి తెలియజేయాలని సూచించాడు.