ఉపాసన ఫోన్ ను రామ్ చరణ్ చెక్ చేస్తాడంట?
Spread the love

రామ్ చరణ్ అతని భార్య ఉపాసన వారిద్దరికీ తమ బంధానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడతారు.రామ్ చరణ్ మీడియాతో తన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునే అలవాటున్న వ్యక్తి. అతని భార్య ఉపాసన కూడా సోషల్ మీడియాలో రామ్ చరణ్  గురించిన పోస్టులు పెడుతూనే ఉంటుంది. తాజాగా చరణ్ తన భార్యను తాను అప్పుడప్పుడు చెక్ చేస్తానని చెప్పాడు. అదేంటీ అనుమానమాకాదండీ అభిమానమే. కాకపోతే ఉపాసన మీద కాదు తమ సినీ అభిమానుల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం. 

రామ్ చరణ్ కు కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో ఖాతా ఉండేది. అభిమానులకు సమాధానలు చెప్పలేక సమయం లేక దానికి ఎప్పుడో మూసేశారు. చెర్రీకి చెందిన  ఏ విషయాలైనా అతని భార్య ఉపాసన షేర్ చేస్తుంటుంది. చరణ్ కి ఎలాగూ ఖాతా లేదు కాబట్టి అభిమానులు కూడా ఉపాసన ఎకౌంట్నే ఫాలో అయిపోతున్నారు. అందుకే రామ్ చరణ్ అప్పుడు తన భార్య ఫోన్ తీసుకుని అందులో సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేస్తాడు. అభిమానుల నుంచి వచ్చిన కామెంట్స్ ఏంటీ? ఏ పోస్టులకు ఎలా స్పందిస్తున్నారు ఇలా తెలుసుకుంటారు. అందుకోసమే అప్పుడప్పుడు ఫోన్ అడిగి తీసుకుంటాడట. 

తాను కూడా త్వరలో సోషల్ మీడియాలోకి మళ్ళి ఎంట్రీ ఇస్తానంటున్నాడు రామ్ చరణ్. ఉపాసన కూడా అదే కోరుకుంటోందని చెప్పాడు. మంచి రోజు చూసుకుని ఖాతా తెరుస్తానని చెబుతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలోని యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో భరత్ అను నేను బ్యూటీ కైరా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది.