చెర్రీ,ఉపాసన వీడియో వైరల్…
Spread the love

సినిమా తారలకున్న బిజీ లైఫ్ లో వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి గడపడం అంత ఈజీ కాదు.అందులోనూ పెద్ద  హీరోలకు పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది.అయితే రామ్ చరణ్ మాత్రం ఈ విషయం లో తన ప్రత్యేకతను మరోరకంగా నిరూపించుకున్నాడు.ఒక పక్క సినిమాల షూటింగ్ లతో పాటు కొణిదెల ప్రొడక్షన్ సంస్థ వ్యవహారాలు మరోపక్క అభిమానులతో తరచు సమావేశాలు కొంచం కూడా విశ్రాంతి లేకుండా రామ్ చరణ్ తరచూ బిజీ షెడ్యూల్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు.

రామ్ చరణ్ కు ఇంత బిజీ షెడ్యూల్స్ లో కూడా అపోలో వ్యవహారాలు చూసుకునే భార్య ఉపాసనతో సమయం గడపడానికి వీలు చిక్కుతుందా.. అనే అనుమాన౦ కలగడం చాలా సహజం.అలాంటి అనుమానాలకు క్లారిటీ ఇవ్వడానికి రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ రోజు ఒక వీడియో పోస్ట్ చేసింది.

రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో స్టూడియోలో చేపట్టిన 7 రోజుల ట్రాన్స్ ఫర్మేషన్ ప్రోగ్రాం కోసం కష్టపడుతుంటే తనను మోటివేట్ చేసేందుకు చెర్రీ కూడా అక్కడే ఉండి తనతో పాటు ఎక్స్ సర్సైజ్ లు వర్క్ ఔట్స్ లాంటివి చేయటం చూస్తే చాలా ముచ్చటేస్తుంది.రామ్ చరణ్ అంత బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా ఇలా ప్రత్యేకంగా తన భార్య ఉపాసన కోసం జిమ్ లో అంత కష్టపడటం చూసి చెర్రీ కి భార్య మీద ఉన్న ప్రేమ చూసి అభిమానులు సంతోష పడుతున్నారు. ఉపాసన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయిపొయింది.