యాత్ర నుంచి మరొక లిరికల్ వీడియో సాంగ్
Spread the love

మహి.వి రాఘవ్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర రూపొందుతోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర .. జనం నుంచి లభించిన ఆదరణ .. ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం ఈ బయోపిక్ లో చూపించనున్నారు.ఈ చిత్రం నుంచి తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ఈ గీతం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.