రాజమౌళి తనయుడు కార్తికేయ నిశ్చితార్థం…
Spread the love

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి తరువాత సుధీర్ఘ విరామం తీసుకున్నారు.ప్రస్తుతం జక్కన్న తన తరువాత చిత్రం ‘RRR’ (వర్కింగ్ టైటిల్‌) ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు.అయితే త్వరలో రాజమౌళి ఇంట్లో ఒక శుభకార్యాన్ని నిర్వహించనున్నారు.రాజమౌళి తనయుడు కార్తికేయ గాయని పూజా ప్రసాద్‌తో కలిసి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు.

గత కొంత కాలంగా ప్రేమ లో ఉన్న కార్తికేయ, పూజల వివాహానికి ఇరుకుంటుంబాల పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పూజప్రసాద్ సీనియర్‌ నటుడు జగపతిబాబు అన్న రామ్ ప్రసాద్‌ కుమార్తె.ఇటివల కార్తికేయ తన తండ్రి రాజమౌళి చిత్రాలకు లైన్‌ ప్రొడ్యూసర్‌గా సెకండ్‌ యూనిట్ దర్శకుడి గా ఉన్న పలు చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ  ప్రముఖలు హజరయ్యారు.