కొడుకు కోసం ఇల్లు వదిలిన పూరి జగన్నాధ్.
Spread the love

ఆకాష్ పూరీ, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందిన ‘మెహబూబా’ చిత్రం మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు పూరీ.

పవన్ కళ్యాణ్‌కు ‘బద్రి’ మహేష్ బాబుకి ‘పోకిరి’.. రామ్ చరణ్‌కు చిరుత.. అల్లు అర్జున్‌కి ‘దేశముదురు’.. ఎన్టీఆర్‌కి ‘టెంపర్’.. రవితేజ‌కు ‘ఇడియట్’.టాప్ హీరోలకు ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ట్రాక్ రికార్డ్ పూరి కి ఉంది.అంతే కాకుండా దర్శకుల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న రికార్డ్ కూడా పూరి జగన్నాథ్ కే సొంత౦.అయితే పూరి మాత్రం తన కొడుకు సినిమాకు సినిమా కష్టాలను అనుభవిస్తున్నాడంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది. కాని పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తన కొడుకు ఆకాశ్ పూరీ హీరోగా సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ‘మోహబూబా’ చిత్రం కోసం సొంత ఇంటిని అమ్మేశాడట. ఈ విషయాన్ని పూరీనే స్వయంగా తెలియజేశారు.కాబట్టి నమ్మక  తప్పదు.

మెహబూబా’ చిత్రం దర్శకుడిగా పూరీకి, హీరోగా ఆశాష్‌కి చాలా ముఖ్యం అయినదనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమ కు ఎన్నో హిట్లను అందించిన పూరీ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మెహబూబా  చిత్రం ద్వారా పూరీ తన సత్తా మరోసారి నిరూపించుకోవడం తో పాట తన కొడుకు ఆకాష్‌కి మంచి హిట్ ఇవ్వాలని చిత్ర నిర్మాణ బాధ్యతల్ని కూడా తనే తీసుకున్నారు.బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో ‘మెహబూబా’ చిత్రాన్ని రూపొందించారు.అయితే ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ కావడంతో తన ఇంటిని కూడా అమ్మేసినట్టు స్వయంగా మీడియాకు తెలియజేసారు పూరీ.

‘మెహబూబా చిత్రం కోసం చాలా రిస్క్ తీసుకున్నా.. ఎందుకంటే ఈ సినిమా మీద.. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. పైగా ఇంత బడ్జెట్‌లో మూవీ అంటే నిర్మాతలు ఆసక్తి చూపరు. అందుకే నేను ధైర్యం చేశా. ఈ సినిమా కోసం నాకున్న ప్రాపర్టీస్‌లో ఒక ఇంటిని అమ్మేశా. అయితే ఎన్నో సందర్భాల్లో చాలా డబ్బు పోగొట్టుకున్నా.. ఈసారి మెహబూబా కోసం ఇన్వెస్ట్ చేశా.. నాకు జీరోతో మొదలు పెట్టడం అలవాటే’ అంటూ‘మెహబూబా’ సినిమా కష్టాలను చెప్పుకొచ్చారు పూరీ జగన్నాథ్.