ప్రియాంక చోప్రా నల్లగా ఉందని మిస్‌ ఇండియా టైటిల్‌ ఇవ్వలేదట…
Spread the love

నటి ప్రియాంక చోప్రా 2000వ సంవత్సర౦ లో మిస్‌ వరల్డ్ టైటిల్‌ గెలిచి గ్లోబల్‌ స్టార్‌గా పేరుపొందింది.17 ఏళ్ల వయసులో ఉత్తర్‌ప్రదేశ్‌ లోని బరేలీ ప్రాంతానికి కి చెందిన ప్రియాంక చోప్రా ఆ రాష్ట్రం తరఫున ఫెమీనా మిస్‌ ఇండియా పోటీలలో  పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.దాని తరువాత మిస్‌ వరల్డ్‌ పోటీలలో పాల్గొంది.అయితే అప్పట్లో ప్రియాంక నల్లగా ఉందని న్యాయ నిర్ణేతలు భావించడం వల్లే ఆమె మిస్‌ ఇండియా టైటిల్‌ను కోల్పోవల్సి వచ్చింది.

ఆ పోటీలలో విజేతను ప్రకటించే ఈ విషయాన్ని మిస్‌ వరల్డ్‌ పోటీదారుల౦దరికి మెంటర్‌ గా వ్యవహరించిన ప్రదీప్‌ గుహ ఓక ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ తెలిపారు.ఆ సమయంలో జ్యూరీ సభ్యులందరు  ప్రియాంక చోప్రా కు టైటిల్‌ ఇవ్వకూడదని అనుకున్నట్లు తెలిపారు.‘జ్యూరీలో ఉన్న ఒక్కరుకూడా ప్రియాంక చోప్రాకు మద్దతుగా లేరు. జ్యూరీలో ఓ సభ్యుడు ప్రియాంక చోప్రా గురించి మాట్లాడుతూ…”ఆమె నల్లగా ఉంది. టైటిల్‌ ఎలా ఇస్తాం?” అని అన్నాడు.అప్పుడు నేను వారికి నచ్చజెప్పాను.ప్రియాంక చోప్రా నల్లగా ఉన్నా కూడా అందంగానే ఉంది అని చెప్పాను.ఈ విషయం కోసం పెద్ద చర్చే జరిగింది.

అంతేకాకుండా 1994లో మిస్‌ ఇండియా పోటీల్లో సుస్మితా సేన్‌కు మరియు ఐశ్వర్య రాయ్‌కు టై పడినట్లుగానే… ప్రియాంక చోప్రాకు లారా దత్తాకు టై పడింది. దాంతో వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి ఆ తరువాత ఫలితాలును  ప్రకటించాం.అందుకే మిస్‌ ఇండియాగా లారా దత్తా గెలిచారు.ఆ తర్వాత ప్రియాంక చోప్రా మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని అందుకున్నారు.ఆ టైటిల్‌ కోసం ప్రియాంక చోప్రా ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు.ప్రతి రోజు తనని తాను చాలా మెరుగుపరుచుకుంటూ వచ్చింది.నాకు తెలుసు ఆమె సాధిస్తారని అని ఆయన తెలిపారు.