రామ్ చరణ్ “రంగస్థలం” సినియా తరహాలోనే ప్రభాస్ సినిమా కూడా…
Spread the love

ఒక జానర్లో ఓ చిత్రం బాగా ఆడితే.. ఇక తర్వాత ఆ తరహా చిత్రాలు వరుస కట్టేస్తాయి. “రంగస్థలం”  తర్వాత పీరియడ్ చిత్రలకు కూడా ఇలాగే ఊపొచ్చినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్లో ప్రస్తుతం పీరియడ్ చిత్రలు చాలానే సెట్స్ మీదికి వెళ్తున్నాయి. సాహో  తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా కూడా ఈ తరహాదేనట.  జిల్  దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇది కొన్ని దశాబ్దాల కిందటి పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ అని అంటున్నారు. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా దీని కోసం భారీ సెట్టింగ్స్ వేయబోతున్నారట. “రంగస్థలం”  చిత్రంలో మాదిరే హైదరాబాద్ శివార్లలో భారీ విలేజ్ సెట్టింగ్ వేయిస్తున్నట్లు తెలిసింది.

“రంగస్థలం”  సెట్టింగ్ వేసిన బూత్ బంగ్లా ప్రాంతంలోనే ఈ సెట్టింగ్ కూడా వేస్తున్నారట. దానికి ఏమాత్రం తీసిపోని రీతిలో సహజంగా.. అందంగా సెట్టింగ్ తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతున్నట్లు, దీనికి రూ.2 కోట్ల దాకా ఖర్చు చేయనున్నారట. ఈ చిత్రం ఆగస్టులోనే మొదలు కాబోతోంది.  సాహో తో పాటే ఈ చిత్రం చిత్రీకరణలోనూ పాల్గొనబోతున్నాడు ప్రభాస్. అతడి స్నేహితులైన వంశీ-ప్రమోద్.. యువి క్రియేషన్స్ బేనర్లోనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘ సాహో ’కు కూడా వాళ్లే నిర్మాతలన్న సంగతి తెల్సింది. సాహో స్థాయిలో కాకపోయినా దీనికి కూడా బడ్జెట్ కూడా భారీగానే అవుతుందట. ఈ సినిమాకి ఇంకా కథానాయిక ఖరారవ్వలేదు. స్టార్ ఇమేజ్ వచ్చాక మాస్-యాక్షన్ చిత్రలే చేస్తూ వచ్చిన ప్రభాస్.. చాలా కాలం తర్వాత చేయబోయే పూర్తి స్థాయి ప్రేమ కథ ఇదని తెలిసి౦ది.