ఆగస్టు 15న “సాహో” విడుదల…
Spread the love

సుజిత్‌  దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’.ఈ చిత్రంలో  ప్రభాస్‌ కు జంటగా శ్రద్ధాకపూర్‌ నటిస్తుంది.ఈ చిత్రానికి వంశీ, ప్రమోద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చెయ్యబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్ర౦ లో యాక్షన్‌ దృశ్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. యాక్షన్‌ సన్నివేశాలను హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించాం…ఇటివలే ప్రభాస్‌ పుట్టిన రోజున సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.అప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రభాస్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆగస్టు 15న జెండా పండగ రోజున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.