ఆ వ్యక్తి కన్నా టెర్రరిస్టులే నయం:పూనమ్ కౌర్
Spread the love

కొంతకాలంగా టాలీవుడ్ హీరోయిన్ – ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనమ్ కౌర్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తన ట్విట్టర్ ఖాతాలో పూనమ్…కొంతకాలంగా యాక్టివ్ గా ఉంటోంది. టాలీవుడ్ లో ఓ ప్రముఖ దర్శకుడు తనకు అవకాశాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి మోసం చేశాడని పూనమ్ చేసిన ట్వీట్లు పెనుదుమారం రేపాయి. తనకు నచ్చిన వారికి ఆ దర్శకుడు ….చాన్స్ ల మీద చాన్స్ లు ఇస్తాడని – తనకు మాత్రం ప్లాప్ లున్నాయని కల్లబొల్లి కబుర్లు చెప్పి బుకాయిస్తాడని ఆరోపించింది. అయితే తన ట్వీట్లలో పూనమ్…ఎవరిపేరును ప్రస్తావించకుండా నర్మ గర్భ వ్యాఖ్యలు చేస్తూ సంచలనం రేపుతూనే ఉంది. తాజాగా అదే తరహాలో పూనమ్ మరో షాకింగ్ ట్వీట్ చేసింది. 

ఓ వ్యక్తి మానవత్వం లేకుండా ఎలా వ్యవహరిస్తాడో తనకు అర్థం కావడం లేదని – అలాంటి వారికన్న టెర్రరిస్టులు నయమంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మన సమస్యలను మనుషులే సృష్టిస్తున్నారని వాటిని పరిష్కరించేందుకు దేవుడు అక్కరలేదని – మానవత్వం ఉన్న మనిషి చాలని వేదాంత ధోరణిలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం పూనమ్ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

యథా ప్రకారమే ఈ సారి కూడా ఎవరి పేరు మెన్షన్ చేయకుండానే పూనమ్ సంచలన ట్వీట్లు చేసింది. మాస్ ను ఆకర్షించే రూపం – అనర్గళంగా మాట్లాడగల నేర్పు ఉన్నవారు తమ వాదనను తొక్కేస్తున్నారని పూనమ్ మండిపడింది. వారు అలా చేసినా….తాము మనుషులుగానే ఉండటానికి ప్రయత్నిస్తామని పూనమ్ ట్వీట్ చేసింది. టెర్రరిస్టులకు కూడా తాము చేసే పనిపై క్లారిటీ ఉంటుందని కానీ ఓ వ్యక్తి మానవత్వం లేకుండా ఎలా వ్యవహరిస్తాడంటూ మండిపడింది. తాను దైవసాక్షిగా చెబుతున్నానని అందరూ అనుకుంటున్న వ్యక్తి గురించి తాను మాట్లాడడం లేదని తనకు తాను కాపాడుకొనేందుకు ఓ వ్యక్తిని మంచివాడని పొగుడుతున్న వ్యక్తి గురించి మాత్రమే ట్వీట్లు చేస్తున్నానని చెప్పింది. ఆ వ్యక్తి గురించి కొందరు న్యూస్ ఛానెల్లో గొప్పగా మాట్లాడుతున్నారని అందుకే తాను స్పందిస్తున్నానని చెప్పింది. గతంలో మీ దేవుడ్ని ఎటాక్ చేసిన ఆ వ్యక్తికి ఇన్నాళ్లూ నిధులు సమకూరుస్తున్న వ్యక్తి ఇప్పుడు నోర్మూసుకొన్నాడని… తాను ఊసరవెల్లిని మాత్రం కాదని పూనమ్ సంచలన ట్వీట్ చేసింది. అయితే పూనమ్ ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్లు చేసిందో స్పష్టత లేదు.