‘పేట’ చిత్రం నుంచి స్పెషల్ గా తెలుగు ట్రైలర్
Spread the love

కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘పేట’ చిత్రం రూపొందింది.తమిళంతోపాటు తెలుగులోను ఈ చిత్రాన్ని జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవల తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేసిన టీమ్, తాజాగా తెలుగులోను స్పెషల్ ట్రైలర్ ను వదిలారు.

“చూడబోతున్నారుగా .. కాళి ఆట. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరినీ మీ పేటలో కలుస్తాను .. అప్పటివరకూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ వదిలిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.ఈ చిత్రంలో రజనీకాంత్ మరింత యంగ్ గా .. స్టైలిష్ గా కనిపిస్తున్నారు.రజినీకాంత్ సరసన హీరోయిన్లుగా సిమ్రాన్,త్రిష నటించారు.ముఖ్యమైన పాత్రల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి,బాబీ సింహా కనిపించనున్నారు.తెలుగు,తమిళ భాషల్లో ఈ సంక్రాంతికి రజనీకాంత్ ఒక రేంజ్ లో సందడి చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.