ఫ్లాప్‌ సినిమా ‘అజ్ఞాతవాసి’ ఆల్‌టైం రికార్డ్‌
Spread the love

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ సినీ ప్రేక్షకులకు మెప్పించడంలో విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడిన ఈ సినిమా తాజా ఆన్‌లైన్‌లో మాత్రం ఆల్‌టైం రికార్డ్‌లను సెట్‌ చేస్తోంది. అజ్ఞాతవాసి హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ను ఎవడు 3 పేరుతో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించి సత్తా చాటింది. అంతేకాదు ఈ ఘనత సాధించి తొలి దక్షిణాది చిత్రంగా రికార్డ్ సృష్టించింది అజ్ఞాతవాసి.