‘ఎన్టీఆర్’లో (రకుల్) శ్రీదేవి  లుక్
Spread the love

ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా క్రిష్‌ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘యన్‌.టి.ఆర్‌’. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పోస్టరు ఇటీవలే రిలీజ్ చేశారు. తొలి భాగాన్ని ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’ టైటిల్‌తో, రెండో భాగాన్ని ‘మహానాయకుడు’ అనే టైటిల్‌‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు . ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.

అతను కథగా మారితే ‘కథానాయకుడు’, అతను ఓ చరిత్ర అయితే మహానాయకుడు’ అవుతాడు అని వెల్లడిస్తూ ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’, ‘యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు’ పోస్టర్లును రిలీజ్ చేశారు డైరెక్టర్ క్రిష్‌. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ చూశాం.. అలాగే చంద్రబాబు లుక్ చూశాం. ఇప్పుడు మరో బ్యూటిఫుల్ లుక్‌ని మూవీ యూనిట్ నేడు(బుధవారం) విడుదల చేసింది. ఆ లుక్ ఎవరిదో కాదు.. లెజెండరీ నటి శ్రీదేవి. ఈ పాత్రను రకుల్ ప్రీత్ చేస్తుంది . కట్టు, బొట్టు విషయంలో శ్రీదేవిని తలపిస్తోంది రకుల్ ప్రీత్ . ఈ బయోపిక్‌కు సంబంధించినటువంటి మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం జనవరి 9న, రెండో భాగాన్ని 24న రిలీజ్ చేయనున్నారు .