‘ఎన్టీఆర్’ నుంచి తొలి లిరిక్స్ వీడియో సాంగ్ విడుదల…
Spread the love

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా…టాలీవుడ్ లోని పలు ప్రముఖ హీరో, హీరోయిన్లు నటిస్తున్న ఎన్టీఆర్  బయోపిక్ నుంచి చిత్ర యూనిట్ తొలి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు.ఘనకీర్తిసాంధ్ర, విజితాఖిలాంధ్ర, జనతా సుదీంధ్ర, మణిదీపకా… అంటూ సాగే ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ఈ పాటకు కీరవాణి స్వరాన్ని అందించారు.ఈ పాటలో ౩౦౦ పైగా చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ ను గుర్తు చేస్తూ… ఆయన పోషించిన పాత్రల పేర్లను పాటలో చేర్చారు.

“భీమసేన వీరార్జున కృష్ణ దానకర్ణ మానధన సుయోధన భీష్మ బృహన్నల విశ్వామిత్ర లంకేశ్వర దశకంఠరావణా.. సురాధి పురాణ పురుష భూమికా పోషకా…అనడం ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది.ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పాట హాల్ చల్ చేస్తుంది.