జయలలిత బయోపిక్ లో నిత్యా మీనన్ లుక్
Spread the love

తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ పనులు చకచకా సాగిపోతున్నాయి. ఈ సినిమాలో జయలలిత పాత్రలో నిత్యామీనన్ కనిపించనున్నారు. నిత్యామీనన్ ప్రతిభ కలిగిన నటి అనే టాక్ వున్న నేపథ్యంలో ఆమె స్కిన్ టోన్, గ్లామర్, హైట్ అన్నీ జయలలిత బయోపిక్‌కు మ్యాచ్ అయ్యాయి. అందుకే ఆమెను జయలలిత బయోపిక్ కోసం తీసుకున్నారట. జయలలిత బయో‌పిక్‌కు ‘ ది ఐరన్ లేడీ ‘ అనే టైటిల్ ను ఖరారు చేశారు. జయలలిత వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం చిత్రబృందం,,సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ లుక్‌లో నటి నిత్యామీనన్ జయ పాత్రలో ఒదిగిపోయినట్టే కనిపిస్తోంది. ప్రియదర్శిని దర్శకత్వంలో..పేపర్ టేల్ పిక్చర్స్ ఈ చిత్రం నిర్మిస్తోంది. ఒక సాధారణ రాజకీయ నేత నుంచి రాజకీయ శక్తిగా మారిన మహిళల్లో జయలలిత ఒకరు.