సవ్యసాచి టీజర్
Spread the love

ఒకే సమయంలో రెండు చేతులతో ఏ పనైనా సులువుగా చేయగలిగే వారిని సవ్యసాచి అంటారు. బారతమ్ లో అర్జునుడికి ఆ పేరు ఉంది. అర్జనుడు తన రెండు చేతులతోనూ బాణాలను సంధించగలడు అందుకే ఆయనను సవ్యసాచి అంటారు. ఇంతటి పవర్ ఫుల్ నేమ్‌ను చందు మొండేటి తన మూవీ టైటిల్‌గా ఫిక్స్ చేశారు. అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ నేడు విడుదల అయింది.

‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే.. సోదరులంటారు అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అంటారు’ అని నాగ చైతన్య చెప్పే వాయిస్‌ ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది . టీజర్‌ని బట్టి చూస్తే ఇది ఇప్పటి వరకూ రానటువంటి డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ‘కనిపించని అన్నని.. కడదాకా ఉండే కవచాన్ని.. ఈ సవ్యసాచిలో సగాన్ని’ అంటూ చైతు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. వాయిస్ ఓవర్‌ని బట్టి చూస్తే పైకి కనిపించని.. ఒకే శరీరంతో ఉన్న కవలల స్టోరీ ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ మూవీ డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.