బారెల్లీకి బర్ఫీ తెలుగు రీమేక్‌లో నాగచైతన్య
Spread the love

మలయాళ హిట్ సినిమా ప్రేమమ్ తర్వాత మరో రీమేక్ సినిమా తీయడానికి సిద్ధం అయ్యాడు నాగచైతన్య. ప్రస్తుతం శివ నిర్వాణ రూపొందిస్తున్న మజిలీ సినిమాలో నటిస్తున్నారు నాగచైతన్య. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది . ఈ మూవీ తరువాత ఈ రీమేక్ సినిమాలో నటించనున్నట్లు తెలిసింది. ఆయుష్మాన్ ఖురానా, కృతిసనన్, రాజ్‌కుమార్ రావు కీలక పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ బారెల్లీకి బర్ఫీ తెలుగు రీమేక్‌లో నాగచైతన్య నటించబోతున్నాడు. 2017 ఆగస్టులో రిలీజ్ ఐన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని పొందింది . కాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల్ని కోన ఫిలిమ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకున్నాయి. ఈ స్టోరీ నాగచైతన్యకు సరిపోతుందని, అతనితో రీమేక్ చేయాలనే ఆలోచనలో సినిమా వర్గాలు వున్నాయాయని, ఇందులో నటించడానికి నాగచైతన్య కూడా సుముఖంగా వున్నట్లు తెలుస్తుంది .